Site icon NTV Telugu

Balineni Srinivas Reddy: ఆరోసారి గెలిచి సిక్స్‌ కొట్టబోతున్నా.. ఒంగోలుకు నా హామీలు ఇవే..

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

Balineni Srinivas Reddy: ఒంగోలు ఎమ్మెల్యేగా ఆరో సారి గెలిచి నేను సిక్క్‌ కొట్టబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఏడోసారి ఒంగోలు బరిలో నిలబడ బోతున్నాను.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో ఆరోసారి ఒంగోలులో గెలవ బోతున్నాను అన్నారు. ఇక, టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలు పోతాయని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ఎక్కడ చూసినా జగనన్న నినాదాలు వినబడుతున్నాయన్న ఆయన.. ఎన్నికలు పక్షపాతం లేకుండా అధికారులు నిర్వహించాలని కోరారు.. మరోవైపు వైసీపీ క్యాడర్ ను టీడీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని మండిపడ్డారు.. ఇక, గతంలో.. మాదిరిగానే తాను ఈ సారి గెలిస్తే.. ఒంగోలుకు ఏం చేస్తాను ముందుగానే ప్రకటించే బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి.. ఈ సారి కూడా కొన్ని హామీలు ఇచ్చారు.. నేను గెలిస్తే ఒంగోలులో ప్రజలకు డైలీ తాగునీరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, విద్యుత్ వంటి వాటిని ప్రజలకు అందించడమే నా ప్రధాన ఎజెండగా పెట్టుకున్నాను అని ఈ సందర్భంగా వెల్లడించారు మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి.

Read Also: IPL Title: పార్టీలు చేసుకున్న జట్లే టైటిల్‌ గెలవలేదు.. సురేశ్‌ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక, ఒంగోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలు నగరంలో భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన.. ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారి జీవీ సుబ్బారెడ్డికి రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు.. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఇక, ర్యాలీకి పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు తరలివచ్చాయి.

Exit mobile version