Balakrishna : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి”.దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార సంస్థ బ్యానర్‌తో కలిసి ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి ముఖ్య పాత్రలో నటించింది.మేకర్స్ ఈ సినిమాను మే 31 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు .ఈ ఈవెంట్ కు నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరు అయ్యారు.
Read Also:Vishwak Sen : బాలయ్య నటి అంజలిని తోసేసిన ఘటనపై స్పందించిన విశ్వక్ సేన్..
అయితే ఈ ఈవెంట్ లో స్టేజిపైన నటి అంజలిని బాలయ్య తోసేసిన ఘటనపై వివాదం చేలరేగింది.బాలయ్యకు మహిళలను గౌరవించడం రాదనీ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.గతంలో కూడా బాలయ్యపై ట్రోల్స్ విపరీతంగా వచ్చాయి.అయితే ఈ ఈవెంట్ లో బాలయ్య మందు తాగి వచ్చారని..బాలయ్య పక్కన వున్నా మందు సీసాను హైలైట్ చేస్తూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.అయితే ఈ వివాదంపై నిర్మాత నాగ వంశీ స్పందించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మందు సీసా నిజం కాదు.అది వాటర్ బాటిల్ దానిలో మందు వున్నట్లుగా సీజి చేసి బాలయ్య పై ట్రోల్స్ చేస్తున్నారు.మేమంతా ఆ ఈవెంట్ లోనే వున్నాం కదా మాకు తెలీదా అక్కడ ఎం జరిగిందో అందుకే దయచేసి ఈ ట్రోల్స్ ఆపండి అని నాగవంశీ తెలిపారు.