నందమూరి బాలయ్య సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్ని భారీ హిట్ ను అందుకున్నాయి.. ఒక్కో సినిమాలో ఒక్కో విధంగా కనిపిస్తూ జనాలను అల్లరిస్తుంటారు.. పాత్ర ఏదైన పరకాయ ప్రవేశం చేస్తారు.. అందుకే దర్శక నిర్మాతలు బాలయ్యతో సినిమాలంటే అత్యుత్సహం చూపిస్తారు.. అంతేకాదు స్టార్ హీరోలు సైతం బాలయ్య సినిమాలో ఒక్క క్యారక్టర్ చేస్తే బాగుండు అని భావిస్తారు.. కొందరు అయితే బాలయ్యతో ఢీ కొట్టే పాత్రలో విలన్ గా చెయ్యాలని ఆశపడతారు..
అయితే ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరో బాలయ్య సినిమాలో విలన్ గా చెయ్యబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి.. హీరోగా నటుడుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన నటుడు శివాజీ ఎన్నో సినిమాలలో నటించారు. రెండు దశాబ్దాల పాటు విరామం లేకుండా సినిమాలు చేసిన బిగ్ బాస్ ఫెమ్ శివాజీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.. ఆ మధ్య రాజకీయాల్లోకి రావడం వల్ల సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నారు..
ఈయన ఇటీవల రియాలిటీ షో బిగ్ బాస్ లో సందడి చేశారు.. తన యాటీట్యూడ్ తో అందరిని ఆకట్టుకున్నారు.. 90 s మిడిల్ క్లాస్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకున్నారు. అంతకంటే విశేషమేమిటంటే శివాజీ విలన్ పాత్ర అని తిరిగి పోషించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని తానే స్వయంగా కన్ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తోంది.. అయితే ఇప్పుడు తెర మీద ఓ వార్త వినిపిస్తుంది.. బోయపాటి శ్రీను, బాలయ్య సినిమాలో చేయబోతున్నట్లు ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ప్రస్తుతం శివాజీకి సంబంధించి ఈ వార్త ఫిలిం ఇండస్ట్రీలో వైరల్ గా మారుతోంది. మరి డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ విషయం పైన స్పందిస్తారేమో చూడాలి..