ఎన్టీఆర్ కొడుకుగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో నటించి అందరి మెప్పించి తిరుగులేని మాస్ హీరో గా ఎదిగారు. మాస్ ప్రేక్షకులకు బాలయ్య సినిమాలంటే పిచ్చి అని చెప్పవచ్చు. ఎన్టీఆర్ నుండి ఫ్యాన్ బేస్ బాలకృష్ణ కి వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం అయితే లేదు కానీ మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం బాలయ్య తన సొంతం గానే తెచ్చుకున్నట్లు తెలుస్తుంది.ఆయనకీ చేసిన సినిమాలు కూడా మాస్ లో మంచి క్రేజ్ ను తెచ్చిపెట్టాయి.. అయితే బాలయ్య కు తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చిన మొట్టమొదటి దర్శకుడు కోడి రామకృష్ణ .
అయితే ఆరోజుల్లో బాలయ్య బాబు మరియు కోడి రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ‘మంగమ్మ గారి మనవడు’ అనే చిత్రం అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ కూడా బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా అయితే నిల్చింది. ‘దంచవే మేనత్త కూతురా’ లాంటి ఫేమస్ సాంగ్ ఈ సినిమాలో నుండి వచ్చిందే గా మరీ.. ఏళ్ళు గడుస్తున్నా కూడా ఆ పాట ఇంకా వినిపిస్తూనే ఉంది. బాలయ్య తొలిసారి బాలనటుడిగా వెండితెర మీద కనిపించిన చిత్రం తాతమ్మ కల. ఈ చిత్రం లో ఆయన భానుమతి లాంటి లెజండరీ ఆర్టిస్టుతో కలిసి నటించిన విషయం తెలిసిందే.. మళ్ళీ ఆమె తోనే ‘మంగమ్మ గారి మనవడు’ చిత్రం లో నటించి కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని అందుకొని స్టార్ హీరో గా మారాడు.ఆరోజుల్లో ఈ చిత్రాన్ని ఎస్ గోపాల్ రెడ్డి కేవలం లక్ష రూపాయిల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించాడని సమాచారం.ఆరోజుల్లో లక్ష రూపాయిల బడ్జెట్ అంటే మామూలు విషయం అయితే కాదు.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకోవడం తో ఈ సినిమాకి టోటల్ గా నాలుగు కోట్ల 80 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిందని సమాచారం.లక్ష రూపాయిలు పెడితే నాలుగు కోట్ల 80 లక్షల భారీ మొత్తంలో కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమా తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి ఎన్నో చిత్రాలను నిర్మించాడు కానీ, ఇలాంటి భారీ మొత్తం మాత్రం ఆయనకు ఎప్పుడూ దొరకలేదు.ఈ సినిమా అత్యధిక సెంటర్స్ లో అర్థ శత దినోత్సవం మరియు శత దినోత్సవం కూడా జరుపుకుంది.