Site icon NTV Telugu

Ganesh Visarjan: గంగమ్మ ఒడికి బాలాపూర్ గణపయ్య.. వర్షంలోనూ భక్తుల కోలాహలం

Balapur Ganesh

Balapur Ganesh

ఉదయం ప్రారంభమైన బాలాపూర్ గణేషుడి శోభయాత్ర.. హుస్సేన్ సాగర్ కు చేరుకుని భారీ భక్తజన సందోహం మధ్య గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. వర్షం పడుతున్న లెక్క చేయకుండా కోలాహలం మధ్య శోభాయాత్ర కొనసాగింది. బాలాపూర్ నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర గణేష్ శోభాయాత్ర కొనసాగింది. హుస్సేన్ సాగర్ వద్ద బాలాపూర్ గణనాథుడికి క్రేన్ నెంబర్ 13 వద్ద ప్రత్యేక పూజలు అనంతరం వినాయకుడిని నిమజ్జనం చేశారు. లక్షలాది మంది లంబోదరుడి నిమజ్జనం చూసి తరించారు.

Read Also: Uttar Pradesh: కూతురు పెళ్లి కోసం పొదుపు చేస్తే.. రూ.18 లక్షలను మాయం చేసిన చెదలు..

అంతకుముందు ఉదయం బాలాపూర్ గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించగా.. భారీ ధర పలికింది. లడ్డూను రూ.27 లక్షలకు దాసరి దయానంద్ రెడ్డి సొంతం చేసుకున్నారు. గతేడాది కంటే రూ.2.40 లక్షలు అదనంగా ధర పలికింది. ఈసారి మొత్తం 36 మంది వేలం పాటలో పాల్గొనగా.. తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. గత ఏడాది వంగేటి లక్ష్మారెడ్డి రూ. 24.60 లక్షలకు బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. బాలాపూర్ లడ్డూ వేలం పాట 1994 నుంచి జరుగుతోంది. బాలాపూర్ లడ్డూ వేలానికి ఇవాళ్టితో 30 ఏళ్లు పూర్తైంది.

Read Also: ODI World Cup 2023: పాకిస్తాన్ ఆటగాళ్లకు హైదరాబాద్ బిర్యానీ.. ఫుడ్ మెనూ చూశారా..!

https://www.youtube.com/watch?v=4uvM-lmgxqg

 

Exit mobile version