అంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ముగిసింది. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తుల నడుమ వేలం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. బాలాపూర్ గణేష్ లడ్డూ ధర సరికొత్త రికార్డ్ ను సృష్టించింది. వేలంలో రూ. 35 లక్షలు పలికింది. లింగాల దశరథ గౌడ్ అనే భక్తుడు వేలం పాటలో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్నాడు. 2024లో రూ.30.01 లక్షల ధర పలికిన విషయం తెలిసిందే.
Also Read:US Tariffs: 2 నెలల్లో భారత్ క్షమాపణలు చెబుతుంది.. అమెరికా అధికారి ప్రేలాపనలు
బాలాపూర్ లడ్డు వేలంపాటలో ఏడు మంది సభ్యులు కొత్తగా పాల్గొన్నారు. మర్రి రవికిరణ్ రెడ్డి -చంపాపేట్, సాము ప్రశాంత్ రెడ్డి -అర్బన్ గ్రూప్ ఎల్బినగర్, లింగాల దశరథ్ గౌడ్- కర్మాన్ ఘాట్, కంచర్ల శివారెడ్డి -కర్మన్ ఘాట్, సామ రామ్‌రాడ్డి( దయా)- కొత్తగూడెం కందుకూరు, పిఎస్‌కె గ్రూప్- హైదరాబాద్, జితా పద్మాసురేందర్ రెడ్డి -చంపాపేట్ లడ్డూ వేలంలో పాల్గొనగా లింగాల దశరథ గౌడ్ లడ్డూను దక్కించుకున్నాడు. లింగాల దశరథ గౌడ్ మాట్లాడుతూ.. బాలాపూర్ గణేష్ లడ్డూ అంటే నాకు చాలా ఇష్టం.. 2019 నుంచి బాలాపూర్ వస్తున్నా.. గత ఆరు ఏళ్లుగా గణేష్ లడ్డూ కోసం ప్రయత్నిస్తున్నా.. ఇప్పుడు భగవంతుడు దయదలిచాడు.. చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
