Site icon NTV Telugu

NBK : నందమూరి బాలయ్య – వివేక్ ఆత్రేయ ఫిక్స్..

Nbk

Nbk

నందమూరి అభిమానులకు ఇది నిజంగా ఊహించని సర్ప్రైజ్. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ, వైవిధ్యమైన కథలతో మెప్పించే యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ సినిమా రాబోతుంది. బాలయ్య మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్.. అటు సరిపోదా శనివారంతో వివేక్ ఆత్రేయ ఊర మాస్ హిట్ కోట్టాడు. ఈ ఇద్దరి   కలిస్తే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో అని ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడే చర్చ మొదలైంది. వివేక్ ఆత్రేయ ఇప్పటివరకు ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికీ’ వంటి సినిమాలతో తనదైన సెన్సిబిలిటీని చాటుకున్నారు. ‘సరిపోదా శనివారం’ సినిమాతో మాస్ ఎలిమెంట్స్‌ను కూడా అద్భుతంగా డీల్ చేయగలనని నిరూపించారు.

ఇప్పుడు నేరుగా ‘గాడ్ ఆఫ్ మాస్’ బాలయ్యను డైరెక్ట్ చేసే అవకాశం అందుకోవడం విశేషం. వివేక్ మార్కు స్క్రీన్ ప్లేకి బాలయ్య ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు ఖాయమనిపిస్తోంది. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే బాలయ్యతో ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సంస్థ, మరోసారి భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో ఈ సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే వివేక్ ఆత్రేయ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. బాలయ్యను వివేక్ సరికొత్త కోణంలో చూపించబోతున్నారని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మరియు అధికారిక ప్రకటన అతి త్వరలోనే వెలువడనున్నాయి.

Exit mobile version