దివంగత ముఖ్యమంత్రి, విశ్వవిఖ్యాత నటుడు, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు 18 జనవరి 1996లో మరణించారు. ఆ మహానాయకుడి 27వ వర్ధంతిని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులు అర్పించారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పొలిటికల్ హీరో అని అన్నారు. ప్రజల కోసం ఎంతో సాహసోపేతమైన పథకాలు తెచ్చారని, పేదవాడి ఆకలి తీర్చిన అమ్మ, ఆడవారికి అండగా నిలిచిన అన్న ఎన్టీఆర్ అని వ్యాఖ్యానించారు బాలకృష్ణ. ఆ తల్లితండ్రులకు బిడ్డగా జన్మించడం తన అదృష్టమన్నారు బాలకృష్ణ. టీడీపీ అనేది రాజకీయ పార్టీ కాదు.. ఒక వ్యవస్థ అని, ఎన్టీఆర్ అన్ని వర్గాల వారిని సమానంగా, సగౌరవంగా ఆదరించారన్నారు బాలకృష్ణ.
Also Read : Uppal Stadium: ఉప్పల్ స్డేడియంకు వెళ్తున్నారా? అయితే ఇవి తప్పనిసరి
ఎన్నో ఆటుపోటులను చూసినా.. ఎన్టీఆర్ ఎప్పుడూ తల వంచలేదని బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారన్నారు బాలకృష్ణ. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి నట ధీరుడు కనిపించడని, నటనలో ప్రతీ పాత్రకు ఆయన జీవం పోశారన్నారు బాలకృష్ణ. ఎన్టీఆర్ ప్రతీ తెలుగు బిడ్డకు ఆత్మవిశ్వాసం కల్పించారని..ఎంతో మందికి రాజకీయ ఓనమాలు నేర్పారని బాలకృష్ణ అన్నారు. మరోవైపు.. తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాలలోని తెలుగు దేశం యువత కూడా ఎన్టీఆర్ విగ్రాహాలకి పూల మాలలు వేసి తమ అభిమాన నాయకుడిని స్మరించుకుంటున్నారు.
Also Read : MLAs Purchase Case : ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై మరోసారి హైకోర్టులో విచారణ
