NBK 111 : బాలయ్య సంచలన నిర్ణయం: రెమ్యునరేషన్ తగ్గించుకున్న నటసింహం.. కారణం అదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ తన కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా రెమ్యునరేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. సాధారణంగా స్టార్ హీరోలు తమ పారితోషికాన్ని పెంచుకుంటూ పోతుంటారు కానీ బాలయ్య మాత్రం తన తదుపరి చిత్రం కోసం రెమ్యునరేషన్ తగ్గించుకున్నట్లు సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ‘అఖండ 2: తాండవం‘ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ బాలయ్య మాస్ పవర్ వల్ల రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే సినిమా బడ్జెట్ దాదాపు రూ. 120-150 కోట్ల వరకు ఉండటంతో, వసూళ్లు బాగున్నా బడ్జెట్ పరంగా ఇది ‘కాస్ట్ ఫెయిల్యూర్‘ మూవీగా మిగిలిపోయింది. ఈ సినిమా కోసం బాలయ్య దాదాపు రూ. 40 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నారని టాక్.
‘అఖండ 2’ ఫలితాన్ని దృష్టిలో ఉంచుకుని NBK 111 విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా బడ్జెట్ రూ. 70 నుంచి 80 కోట్ల లోపే పూర్తయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య తన రెమ్యునరేషన్‌ను రూ. 40 కోట్ల నుంచి రూ. 30 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా మేకింగ్ లో కంప్రమైజ్ కాకుండా అలానే నిర్మాతకు భారం కాకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. బడ్జెట్ నియంత్రణలో భాగంగా హీరోయిన్ విషయంలోనూ మార్పులు జరిగాయి. మొదట ఈ సినిమాలో నయనతారను హీరోయిన్గా అనుకున్నారు. కానీ ఆమె రెమ్యునరేషన్ దాదాపు రూ. 8.5 కోట్లు కావడంతో అంత భారీ మొత్తం ఇస్తే బడ్జెట్ పెరిగిపోతుందని చిత్ర యూనిట్ భావించింది. దీంతో నయనతార స్థానంలో కాజల్ అగర్వాల్‌ను సంప్రదించగా కేవలం రూ. 1.5 కోట్ల పారితోషికానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Also Read
- Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
- AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
- MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
- CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
తాజావార్తలు
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
-
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
-
CJP: కాక్రోచ్ పార్టీపై కేసు.. రాజస్థాన్ గ్రామస్తుల ఫిర్యాదు..
-
Calorie Deficit: బరువు తగ్గే డైట్లో ఆకలి ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!