NTV Telugu Site icon

Balakrishna : వీరసింహారెడ్డిలో పొలిటికల్‌ డైలాగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు

Balakrishna

Balakrishna

నందమూరి బాలకృష్ణ కుటుంబ సమేతంగా సంక్రాంతి పండుగ వేడుకల కోసం నారావారిపల్లె వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేడు ఆయన చంద్రగిరిలోని ఎస్వీ థియేటర్‌లో సందడి చేశారు. ఆయన నారావారిపల్లె నుంచి స్వయంగా కారులో చంద్రగిరి రాగ, మరో కారులో వసుంధర, మోక్షజ్ఞ, దేవాన్ష్ వచ్చారు. థియేటర్ వద్ద బాలయ్యకు అభిమానులు ఘనస్వాగతం పలికారు. బాలయ్య రాకతో థియేటర్‌ ప్రాంగంణం కోలాహలంగా మారింది. ఫ్యాన్స్ థియేటర్ వద్ద 50 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. కాగా, కుటుంబ సభ్యులతో కలిసి ఎస్వీ థియేటర్ లో వీరసింహారెడ్డి సినిమాను తిలకించారు బాలకృష్ణ. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. వీరసింహారెడ్జి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

Also Read : Kaali Movie Poster Row: ‘కాళీ’ సినిమా పోస్టర్‌ వివాదం.. సుప్రీంను ఆశ్రయించిన ఫిల్మ్‌మేకర్

సంక్రాంతి పండగ అంటే బాలకృష్ణ పండగ అని, వీరసింహారెడ్డి ఫ్యాక్షన్ సినిమా కాదన్నారు. సకుటుంబ సపరివారసమేతంగా చూస్తున్నారని, నిర్మాతలు చిత్రాన్ని నాణ్యతలో రాజీపడకుండా నిర్మించారన్నారు. దర్శకుడు గోపీచంద్ మలినేని నా అభిమానిగా గొప్పగా సినిమా తీశారని, ఆణిముత్యం లాంటి పాటలకు వజ్రాల్లాంటి బాణీలు థమన్ సమకూర్చారన్నారు. ప్రేక్షకులు మంచి సినిమా చేస్తే ఆదరిస్తారన్నారు. అంతేకాకుండా.. . సినిమాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సంభాషణలు ఉన్నాయన్న దానిపై స్పందించిన బాలకృష్ణ.. ప్రజల అభిమానాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసునని, రాష్ట్రంలో ఎమర్జన్సీ పరిస్థితులు ఉన్నాయన్నారు. ఓ నటుడిగా, ఎమ్మెల్యేగా, ఓటరుగా చెపుతున్నానని, జరుగుతున్న పరిస్దితులనే వీరసింహారెడ్డి సినిమాలో చూపించామన్నారు.

Also Read : Raviteja: అన్నయ్య ఇవన్నీ కాదు, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ సినిమా చేద్దాం