NTV Telugu Site icon

Balakrishna: ఎన్టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..

Balakrishana

Balakrishana

కాజల్‌ అగర్వాల్‌ పోలీసు ఆఫీసర్‌గా నటించిన తాజా చిత్రం ‘సత్యభామ’. ఈ సినిమాకి సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించారు. సత్యభామ సినిమా క్రైమ్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందింది. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర ఓ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం జూన్‌ 7న ప్రేక్షకుల ముందకు రానుంది. దీనితో చిత్ర బృందం ట్రైలర్‌ ని శుక్రవారం నాడు విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

RR vs SRH Qualifier2: హాఫ్ సెంచరీతో ఆదుకున్న క్లాసెన్.. రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 176..

ఎలక్షన్ క్యాంపెయిన్ వల్ల గత 45 రోజులుగా తాను కెమెరాను చూడలేదని., ఇన్ని రోజులు మిస్ అయిన ఆ సందడి అంతా ఈరోజు సత్యభామ ఈ‌వెంట్ లో చూస్తున్నానట్లు తెలిపారు. సత్యభామ ట్రైలర్ లాంఛ్ కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. చిత్ర దర్శకుడు సుమన్ చిక్కాల, నిర్మాతలు బాబీ తిక్క, శ్రీనివాసరావు, సమర్పకులు శశికిరణ్ తిక్క..అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. వీళ్లకు ప్రొడక్షన్ తో పాటు డిస్ట్రిబ్యూషన్ లోనూ అనుభవం ఉంది. ఉగాది పచ్చడిలా సినిమా ఇండస్ట్రీలోని అన్ని అనుభవాలు వీరికి తెలుసు. ఆ అనుభవంతోనే సత్యభామ అనే సూపర్ హిట్ సినిమా చేశారని నమ్ముతున్నానని ఆయన అన్నారు.

Balakrishna: ఎన్టి రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదు.. బాలయ్య హాట్ కామెంట్స్..

ఈ సందర్బంగా ఆయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు. ముందుగా ‘సత్యభామ’ చిత్ర బృందానికి అల్ ది బెస్ట్ చెప్పారు. ఆ తర్వాత ఆయన ఎన్. టి. రామారావు వారసులు అంటే ఆయన గురించి చెప్పుకోవడం కాదని., ఆయన సినిమాలు గురించి చెప్పుకోవడం కాదంటూ తెలిపారు. తాము ఆయన దారిలో అనుసరిస్తున్నామా.. లేదా.. అనేది ముఖ్యం అంటూ హాట్ కామెంట్స్ చేసారు. ఇక ఈ ఈవెంట్ లో బాలయ్య మాట్లాడిన విశేషాలను ఈ కింది వీడియోలో చూసేయండి.

Show comments