Akhanda 2: మాస్‌ కాంబోలో నాలుగో చిత్రం.. ఈసారి ‘అఖండ’ తాండవమే!

  • మరోసారి బాలకృష్ణ-బోయపాటి మాస్‌ కాంబో
  • అఖండ సినిమాకు సీక్వెల్
  • అఖండ 2-తాండవం
Akhanda 2 Thaandavam

Akhanda 2 Thaandavam

Akhanda 2 Thaandavam Poster Released: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను మాస్‌ కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్‌, అఖండ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. లాక్‌డౌన్ టైంలో అదీనూ సీజన్ కాని సమయంలో రిలీజైన అఖండ చిత్రం బాలయ్య బాబు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. అప్పుడే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. నేడు అధికారికంగా అనౌన్స్ చేశారు.

అఖండకు సీక్వెల్‌గా ‘అఖండ 2 – తాండవం’ తెరకెక్కనుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. టైటిల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ ఈరోజు విడుదల చేసింది. అఖండ 2 అనే టైటిల్‌కి తాండవం అనే ట్యాగ్ లైన్ జోడించారు. తొలి భాగం ఎక్కడైతే ఆగిందో.. అక్కడి నుంచే రెండో భాగం మొదలవుతుంది. అఖండ పాప పెద్దయిన తర్వాత ఏం జరిగిందనేది ఇందులో చూపించబోతున్నారు. బుధవారం పూజా కార్యక్రమంతో అఖండ 2ను లాంచ్ చేయనున్నారు.

Also Read: Nani Heroine: ఆ ఇద్దరిలో నాని హీరోయిన్ ఎవరు?

స్కంద డిజాస్టర్ తర్వాత బోయపాటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మరోవైపు బాలయ్య బాబు వరుస హిట్స్ కొడుతుండడంతో అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాబీ మూవీతో బాలయ్య బిజీగా ఉన్నారు. ఈ షూటింగ్ తర్వాతే అఖండ 2 షూటింగ్‌లో ఆయన పాల్గొంటారు. సీక్వెల్‌కి తమన్ సంగీతం అందిస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు.