Balakrishna: లేడీ ఫ్యాన్ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన బాలయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ అగ్ర హీరో నందమూరి నటసింహం బాలయ్య గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఆయన సినిమాల్లో గాంభీరంగా ఉన్నా కూడా బయట ఆయన మనసు వెన్నే.. ఒక్క మాటలో చెప్పాలంటే రియల్ హీరో..అభిమానుల మీద కస్సుబుస్సులాడినా బాలయ్య మనసు బంగారం.. ఆయన అభిమానులు, ఆయన గురించి బాగా తెలిసిన సన్నిహితులు ఇదే చెబుతారు.. స్వచ్చమైన మనసు కలిగిన బాలయ్య తనకు ఎవరైనా నచ్చితే అంతే.. వారి కోసం ఏమైనా చేస్తారు. ఇటీవల విమానంలో పరిచయమైన ఓ వ్యక్తి గృహప్రవేశానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారాయన. ఈ విషయాన్ని మరోసారి నిరూపించుకున్నారు నందమూరి నటసింహం. ఒక లేడీ అభిమాని పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. కేక్ కటింగ్ చేయించి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఇందుకు సంబందించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ప్రస్తుతం బాలయ్య తానా సభల కోసం అమెరికాలోని ఫిలడెల్పియాలోనే ఉంటున్నారు.. ఆయన తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు.. ఈ సందర్భంగా తెలుగు వారి రాజసం ఉట్టిపడేలా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చారు బాలయ్య. ఈ క్రమంలోనే ఒక అమ్మాయి బాలకృష్ణ దగ్గరకు వచ్చింది. తన పుట్టిన రోజు అని చెప్పగానే.. వెంటనే ఆమెతో కేక్ కటింగ్ చేయించాడు..ఆమెను బాలకృష్ణ, ఆయన సతీమణి అక్షింతలు వేసి మనసారా ఆశీర్వదించారు. తద్వారా ఆ లేడీ అభిమానికి జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాన్ని అందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..
Also Read
- MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
- Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
బాలయ్య అభిమానులు దీనిని చూసి మురిసిపోతున్నారు. ‘మా బాలయ్య మనసు బంగారం.. దటీజ్ బాలయ్య’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.. ప్రేమతో పిలిస్తే ఎక్కడికైనా వెళ్తారు.. అందుకే జై బాలయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో భగవత్ కేసరి అనే మూవీలో నటిస్తున్నారు బాలయ్య. కాజల్ అగర్వాల్, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ సినిమా పై భారీ అంచనాలను పెంచుతున్నాయి.. ఇక త్వరలోనే ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది.
A Lady Fan Celebrated her birthday with our Legend #Balayya and Vasundhara garu at Philadelphia US#jyosribollineni #anganwadiwing pic.twitter.com/GkViaiSdzu
— jyothi bollineni(B+ve Blood Group) (@JyothiBollineni) July 10, 2023
తాజావార్తలు
-
MAHARASHTRA: శ్రావణంలో ‘‘మటన్’’ కావాలని గొడవ.. కొడుకును చంపిన తండ్రి..
-
Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
-
Liquor Policy: లిక్కర్ పాలసీపై తమిళనాడులో రాజకీయ వేడి.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త విధానం..
-
Sri Veerabhadra Swamy Temple: శివయ్య వీరభద్రుడిగా వెలసిన 1500 ఏళ్ళ బ్రహ్మసూత్ర శివాలయం
-
Ganja Smuggling Busted: ఒడిశా టు హైదరాబాద్.. గంజాయి స్మగ్లింగ్‌కు చెక్..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!