Site icon NTV Telugu

Balakrishna : ఇద్దరు భామలతో బాలయ్య కిరాక్ పోజు.. ఫోటో వైరల్..

Kusbu

Kusbu

Balakrishna : మొన్నటి వరకు రాజకీయాలలో బిజీబిజీగా గడిపేసిన నందమూరి బాలకృష్ణ మళ్ళీ సినిమాల వైపు నడుస్తున్నారు. ఈ మధ్యనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హిందూపురంలో హ్యాట్రిక్ విజయం అందుకొని బాలకృష్ణ మరోసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ సినీ కెరియర్లో 109వ సినిమాగా కొల్లి బాబి దర్శకత్వంలో సినిమాలో నటిస్తున్నారు. ఇక టాలీవుడ్ మరో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో మూడోసారి నటించనున్నాడు.

CM Chandrababu: ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోడీతో భేటీ!

ఇకపోతే ప్రస్తుతం నటి వరలక్ష్మి శరత్ కుమార్ వెళ్లి రిసెప్షన్ జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సంబంధించిన అనేకమంది తారలు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే సీనియర్ నటి కుష్బూ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో నందమూరి బాలకృష్ణ సీనియర్ నటిమణులు శోభన, కుష్బూలతో ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఫోటోలో కనబడుతుంది. మరో ఫోటోలో కుష్బూ విక్టరీ వెంకటేష్, శోభన లతో కలిసిన ఫోటోను షేర్ చేసింది. మొత్తానికి సినీ ప్రేమికులు కుష్బూ షేర్ చేసిన ఫోటోలను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. బాలయ్య ఫోటో పై నిటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఇద్దరి భామలతో భలే ఫోజు ఇచ్చావ్ బాసు అంటూ కామెంట్ చేస్తున్నారు.

Exit mobile version