NTV Telugu Site icon

Balakrishna-Bobby: సంక్రాంతికి కాదు.. ఆ సెంటిమెంట్‌ రోజే సినిమా విడుదల!

Balakrishna Bobby

Balakrishna Bobby

నందమూరి నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా, డైరెక్టర్ బాబీ (కెఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఊర్వశీ రౌతేలా, పాయల్‌ రాజ్‌పుత్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయక పాత్ర చేస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలకృష్ణ మాస్‌ స్టైలిష్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా తాజా అప్‌డేట్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Kalki 2898 AD 2: ‘కల్కి 2’ అప్‌డేట్‌.. షూటింగ్‌ ప్రారంభమయ్యేది అప్పుడే!

2025 సంక్రాంతి కానుకగా బాలకృష్ణ-బాబీ సినిమా విడుదల కానున్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో ఏ నిజం లేదని తెలుస్తోంది. షూటింగ్‌ ఇప్పటికే చాలావరకూ పూర్తయిన నేపథ్యంలో ఆలస్యం చేయకుండా.. డిసెంబర్‌ 2నే సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అఖండ చిత్రం విడుదలైంది కూడా ఇదే రోజు కావడం విశేషం. సెంటిమెంట్‌గా డిసెంబర్‌ 2 బాగా కలిసొస్తుందని మేకర్స్‌ భావిస్తున్నారట.

Show comments