అఖండ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. ఈసినిమాలో అందాల తార శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే..ఈ సినిమా ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు మైత్రీ మేకర్స్. ఈ సినిమాలోని కీలకమైన పాత్రతో హనీ రోజ్ పరిచయమవుతోంది. అయితే.. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. హీరోయిన్ శృతిహాసన్ తన రాక్షసి అంటూ బాలకృష్ణ కామెంట్ చేశారు.
Also Read : Balakrishna : సిగరెట్ కంటే చుట్ట మంచిది.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
ఊర్వశివో రాక్షసివో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నయనతార ఊర్వశి అని, శృతిహాసన్ రాక్షసి అని అప్పుడే చెప్పానని ఆయన గుర్తు చేశారు. అయితే.. ఈ విషయాన్ని కూడా శృతిహాసన్‌కు చెప్పానని, ఆమె దానికి నవ్వుతూ హైఫైవ్ ఇచ్చారని బాలయ్య చెప్పుకొచ్చారు. తనది రాక్షసగణమని, శృతి రాక్షసి కావడంతో ఇద్దరికి బాగా కలిసిందని శృతిహాసన్‌తో ముచ్చటించిన విషయాన్ని బాలయ్య. ఇక శృతి మంచి నటి అని బాలయ్య కొనియాడారు. మరోవైపు ఏ రంగంలోనైనా పోటీ ఉండాల్సిందేనని బాలకృష్ణ అన్నారు. పోటీ ఉంటేనే ఇండస్ట్రీ బాగుంటదని తెలిపారు. వీరసింహారెడ్డికి పోటీగా వస్తోన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రానికి బాలయ్య ఆల్ ది బెస్ట్ చెప్పారు.
Also Read : Chiranjeevi: హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి.. చిరు సూటి ప్రశ్న
