అఖండ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తుండగా.. ఈసినిమాలో అందాల తార శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే..ఈ సినిమా ఈ నెల 12న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు మైత్రీ మేకర్స్. ఈ సినిమాలోని కీలకమైన పాత్రతో హనీ రోజ్ పరిచయమవుతోంది. అయితే.. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా బాలకృష్ణ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. తనకు చుట్ట తాగే అలావాటు ఉందని, రోజు ఉదయం లేచిన వెంటనే చుట్ట తాగుతానని అన్నారు. వీరసింహారెడ్డి సినిమాలో చుట్ట తాగడం స్టైల్ కూడా అందరినీ ఆకర్షిస్తుందని వివరించారు బాలయ్య. ఈ సినిమాలో బాలకృష్ణ గెటప్ కోసం చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని డైరెక్టర్ గోపీచంద్ వెల్లడించారు. ఈ క్రమంలోనే చుట్టు కూడా పెట్టామన్నారు. అయితే.. చుట్ట తాగడం వల్ల గొంతు క్లీన్‌గా.. ఊపిరితిత్తుల్లో ఉండే శ్లేష్మం పోయి.. గొంతు గంభీరంగా వస్తుందని, డైలాగ్ చెప్పేటప్పుడు ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు చుట్ట తాగుతుంటానని బాలకృష్ణ తెలిపారు. అదే సమయంలో.. చుట్టను సిగరెట్‌లా లోపలికి పీల్చుకోకుండా.. కేవలం నోట్లోకి మాత్రమే పీల్చుకుంటామని.. సిగరెట్ కంటే చుట్ట మంచిదని బాలయ్య వివరించారు.
Also Read : Chiranjeevi: హీరోలు ఎందుకు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి.. చిరు సూటి ప్రశ్న
ఇదిలా ఉంటే.. తమన్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి ఇంతవరకూ వదిలిన ప్రతి పాటా మాస్ ఆడియన్స్ లోకి దూసుకెళ్లింది. ప్రమోషన్ భాగంగా నిన్న ఈ సినిమా నుంచి ‘మాస్ మొగుడొచ్చాడే’ అనే మరో పాటను వదిలారు. ‘యాంది రెడ్డి .. యాంది రెడ్డి యాడజూడు నీదే జోరు, తొడలు గొట్టి .. హడలగొట్టి మొగతాంది నీదే పేరు’ అంటూ ఈ పాట మొదలవుతోంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట సాహిత్యం మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది. మనో – రమ్య బెహ్రా తమ స్వరంతో ఈ పాటను మరింత హుషారుగా పరిగెత్తించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో కలర్ ఫుల్ సెట్స్ లో చిత్రీకరించిన ఈ పాట, మాస్ నుంచి మంచి మార్కులను కొట్టేసేలానే ఉంది.