NTV Telugu Site icon

Bala Veeranjaneya Swami: బాధ్యతలు స్వీకరించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి..

Bala

Bala

మంత్రి బాల వీరాంజనేయ స్వామి బాధ్యతలు స్వీకరించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఛాంబర్లోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన మీద చంద్రబాబు ఉంచిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. తన శాఖ ద్వారా పేదలకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని అన్నారు. 2014-19 కాలంలో కొన్ని గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లు ఇచ్చామని.. గత ప్రభుత్వంలో జగన్ ఈ సీట్లను రద్దు చేశారని తెలిపారు. ఇవి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1600 ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు.. సింగరాయకొండలో బైపీసీలో 40, ఎంపీసీలో 40 సీట్లు రద్దు చేశారు.. వాటిని తిరిగి పునరుద్దరిస్తూ తొలి సంతకం చేశానని చెప్పారు.

Rohit-Pant: రిషబ్ పంత్ అత్యుత్సాహం.. రోహిత్ శర్మ సీరియస్ (వీడియో)!

అలాగే.. పర్చూరు నియోజకవర్గం, నాగులుపాలెం గురుకుల పాఠశాలలో పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 15 లక్షలతో సోలార్ ప్రాజెక్టును హట్ వాటర్ కోసం మంజూరు చేశామన్నారు. గత ప్రభుత్వంలో ఫీజు రిఎంబర్స్మెంట్ పథకం కింద నోడల్ ఏజెన్సీగా సోషల్ వెల్పేర్ డిపార్మెంట్ ఉందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి రూ. 2505.56 కోట్లు గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టారని ఆరోపించారు. వాటిని ఇప్పడు తాము చెల్లించాల్సి వస్తోందని చెప్పారు. బకాయిలు చెల్లించకుంటే వారికి సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్ధితి ఉందని తెలిపారు.

Jammu Kashmir: దోడాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం..

మరోవైపు.. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకానికి రూ. 199 కోట్లు బకాయిలున్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. అంబేద్కర్ విదేశీ విద్య పథకం కింద రూ. 5.69 కోట్లు బకాయిలు పెట్టి వెళ్లారని తెలిపారు. బెస్ట్ ఎవైలబుల్ స్కూళ్లను గత ప్రభుత్వం రద్దు చేసి రూ. 60.10 కోట్లు బకాయిలు పెట్టిందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టానికి సంబంధించి వారికి రావాల్సిన బకాయిలు ఆర్ధిక శాఖ నుంచి రూ. 21.81 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొన్నారు. అన్ని పథకాలపై గత ప్రభుత్వంలో మొత్తం బకాయి రూ. 3573.22 కోట్లుగా ఉందని తెలిపారు. ఇప్పడు ఆ భారం మొత్తం తమ ప్రభుత్వంపై పడిందని మంత్రి పేర్కొ్న్నారు.