Back-to-Back Murders: అనంతపురంలో వరుస హత్యల కలకలం..
- ఇద్దరి ప్రాణాలు తీసిన పగ.. ఆవేశం
- 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరి హత్య
- చిదానందంకు భార్యతో 9 నెలల క్రితం గొడవ
- బళ్లారి బైపాస్ రోడ్డులో గుర్తు తెలియని వ్యక్తుల దాడి
- 2 నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్‌తో పరిచయం
- ఇద్దరి మధ్య ఏర్పడ్డ వివాహేతర బంధం
- సురేష్ బాబుకు అనుమానం రావడంతో గొడవలు
- సురేష్ బాబును అడ్డు తొలగించాలని చెప్పిన అనిత
- ఖాళీ సీసా విసిరి దాడి చేసిన ఫకృద్దీన్
- సురేష్ బాబుని స్క్రూ డ్రైవర్‌తో పొడిచాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో … రెండు హత్యలు ఒకేలా జరగడం సంచలనం సృష్టిస్తున్నాయి. రెండు హత్యలకు ఓకే రకమైన ఆయుధాన్ని ఉపయోగించడం పోలీసులకు సవాలుగా మారింది.
అనంతపురంలో పగ.. ఆవేశం ఇద్దరి ప్రాణాలు తీశాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఇద్దరిని హత్య చేశారు. ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు చిదానంద. ఇతనికి భార్యతో 9 నెలల క్రితం గొడవ జరిగింది. ఆ సమయంలో భార్య మృతి చెందింది. దీంతో ఆ కేసులో గార్లదిన్నె పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇటీవల బయటకొచ్చిన చిదానంద… ఊరు విడిచిపెట్టి అనంతపురంలోని కిరాణా దుకాణంలో పని చేస్తూ జీవిస్తున్నాడు. ఐతే అతనిపై బళ్లారి బైపాస్‌లోని అన్న క్యాంటీన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. బండరాయితో మోది హత్య చేశారు..
READ MORE: Fake Liquor Factory: కాస్తంత స్పిరిట్.. కొంచెం కేరమిల్‌తో ఇంట్లోనే మద్యం తయారీ.. చివరికీ..
Also Read
- Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
అయితే మృతుని తల్లి మాత్రం ఈ హత్య.. చిదానంద భార్య బంధువులే చేశారని ఆరోపించారు. ఇటీవల భార్య అనుమానాస్పద మృతి కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చిదానందపై కసి పెంచుకొని హత్య చేశారని మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హత్యకు కుటుంబ కలహాలే కారణమా? మరి ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కళ్యాణదుర్గం రోడ్‌లో సురేష్ బాబు, అనిత హోటల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. అయితే 2 నెలల క్రితం అనితకు ఫక్రుద్దీన్ అనే ఒక పండ్లు అమ్ముకునే వ్యక్తి పరిచమయ్యాడు. అది కాస్తా వారి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయంలో సురేష్ బాబుకు అనుమానం రావడంతో మద్యం సేవించి అనితను వేధించసాగాడు.
READ MORE: Hyderabad: ఓయో రూంలో యువతి మృతదేహం.. ఇది హత్యా.. ఆత్మహత్యా..?
తమ సంబంధానికి భర్త సురేష్ బాబు అడ్డుగా ఉన్నాడని ఫక్రుద్దీన్‌తో చెప్పింది అనిత. దీంతో ఎలాగైనా అతన్ని అడ్డు తొలగించుకుంటే సంతోషంగా ఉండవచ్చని హత్యకు ఉసిగొల్పింది. ఫక్రుద్దీన్.. సురేష్ బాబు హోటల్ మూసివేసి.. ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఖాళీ సీసా విసిరి దాడి చేశాడు. వెంటనే కింద పడ్డ సురేష్ బాబుని స్క్రూ డ్రైవర్‌తో పొడిచాడు. ఆ తర్వాత బండరాయితో మోది హత్య చేశాడు.. ఈ రెండు హత్యలు కారణాలు ఏవైనప్పటికీ తక్కువ వ్యవధిలోనే 2 మర్డర్లు జరగడం మాత్రం అనంతపురం జిల్లాలో కలకలం రేపుతోంది. అదీ కాకుండా రెండు హత్యల్లో బండరాయినే మారణాయుధంగా వాడారు..
తాజావార్తలు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
-
TS Inter 2026 : ఇంటర్ పాస్.. మెమోలు రెడీ.. ఎక్కడ తీసుకోవాలంటే.?
-
Former OSD Sumanth : మంత్రి మాజీ ఓఎస్డీపై అటెంప్ట్ మర్డర్ కేసు..
-
JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?