Erracheera The Beginning: నటుడు రాజేంద్ర ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. హీరోగా, కమెడియన్ గా, నటుడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించకున్నారు. ఆయన ఓ పాత్ర ఒప్పుకున్నాడంటే అందులో జీవించేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన తర్వాత ఆయన సంతానం ఎవరూ సినిమాల్లోకి రాలేదు. కానీ తర్వాత తరం ఆయన మనుమరాలు తెరంగేట్రం చేస్తోంది. శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – The Beginning. ఇప్పటికే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబు అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటుడు రాజేంద్రప్రసాద్ గారి ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది.
ఈ సినిమాలో 45 నిమషాలు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో సుమన్ బాబు స్వీయ దర్శకత్వం చేస్తూ ఒక ముఖ్య పాత్ర పోషించారు. సినిమాను మథర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ తో రూపొందించినట్లు నిర్మాత ఎన్. వి.వి. సుబ్బారెడ్డి తెలిపారు. బేబీ సాయి తేజస్విని నటన సరికొత్తగా ఉంటుందని, క్లైమాక్స్ లో ఉన్న మదర్ సెంటిమెంట్ అందరికీ కన్నీరు తెపిస్తుందని, కారుణ్య చౌదరి సరికొత్తగా కనిపించబోతుంది అని దర్శకుడు సుమన్ బాబు తెలియజేశారు. శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు, మొదలుగు వారు ప్రధాన పాత్రదారులుగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాకి ఎస్ చిన్న అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించగా, ప్రమోద్ పులిగార్ల తనదైన శైలిలో మ్యూజిక్, ప్రదీప్ – సౌండ్ ఎఫెక్ట్స్ అందించారు. ఈ చిత్రం “ఎర్రచీర – The Beginning” సినిమాను డిసెంబర్ 20 న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు విజయదశమి సందర్భంగా తెలియజేశారు.
Read Also:Ponnam Prabhakar : స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొన్నం క్లారిటీ
Read Also:Dussehra Wishes 2024: జమ్మితో నిత్య జయాలు కలగాలి.. దసరా పండగ సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు