NTV Telugu Site icon

Viral : వావ్‌.. కాళ్లకు, చేతులకు 24 వేళ్లు.. జగిత్యాలలో అరుదైన ఘటన..

Baby Boy

Baby Boy

కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. జన్మించిన శిశువుకు ఒక్కో చేయి, కాలుకు ఆరు చొప్పున మొత్తం 24 వేళ్లు ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఎరగట్లకు చెందిన సుంగారపు రవళి మొదటి ప్రసవం కోసం కోరుట్ల ఆసుపత్రిని వచ్చింది. అయితే.. సాధారణ ప్రసవంలో ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. నవజాత శిశువుకు ఒక్కొ చేతుకు ఆరు వేళ్లు, కాళ్ళకు ఆరు వేళ్లు ఉన్నాయి.

Also Read : Nitish Rana – Hrithik Shokeen: ఆ ఇద్దరికి బీసీసీఐ షాక్.. ఫీజులో కోత

అయితే.. తల్లీబిడ్డల పరిస్థితి నిలకడగా ఉందని, వైద్య పరిభాషలో పాలీడాక్టిలీ కండిషన్ అని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పాలిడాక్టిలీ కండిషన్‌తో జన్మించిన శిశువుల గుండెలో రంధ్రం ఉండే అవకాశం ఉందని వారు తెలిపారు. అయితే.. ప్రస్తుతం శిశువుకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడించారు వైద్యులు. అయితే.. రవళికి నొప్పులు రావడంతో తొలుత మెట్‌పల్లి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో కోరుట్ల ఆస్పత్రికి తరలించారు.

Also Read : Hardik Pandya: హార్దిక్ అరుదైన ఘనత.. రాజస్థాన్ చెత్త రికార్డ్.. తొలిసారి రివేంజ్