NTV Telugu Site icon

Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబుమోహన్‌.. ఎంపీగా పోటీ

Babu Mohan

Babu Mohan

Babu Mohan: మాజీ మంత్రి, ప్రముఖ నటుడు బాబు మోహన్‌ ప్రజా శాంతి పార్టీలో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నారు. ఈ మేరకు కేఏ పాల్ ప్రకటించారు.

Read Also: BRS Chief: కాంగ్రెస్పై వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీ సద్వినియోగం చేసుకోవాలి

టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్… చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రోజు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.

Show comments