Pakistan Semi Final: పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుంది.. ప్రణాళికలు సిద్ధం చేసిన బాబర్ ఆజామ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam React on Pakistan Semi Final Chances: శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచ్ ముందు వరకూ పాకిస్థాన్‌కు ప్రపంచకప్ 2023 సెమీస్ అవకాశాలు మెండుగానే ఉన్నాయి. లంకపై ఘన విజయంతో నెట్ రన్‌రేట్‌ను పెంచేసుకున్న కివీస్.. నాలుగో జట్టుగా సెమీస్‌లో ఆడటం దాదాపుగా ఖాయమే అయింది. న్యూజిలాండ్ గెలుపుతో పాక్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. ఇప్పుడు పాక్ ముందంజ వేయాలంటే.. ఇంగ్లండ్‌పై కనివిని ఎరుగని విజయాన్ని అందుకోవాలి. మొదట బ్యాటింగ్ చేస్తే 287 పరుగులు, ఛేదనలో అయితే 284 బంతుల తేడాతో పాకిస్తాన్ గెలవాల్సి ఉంది. అది అసాధ్యం అయినా.. పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుందని ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో బాబర్ ఆజామ్ మాట్లాడుతూ… ‘ప్రపంచకప్ 2023 సెమీస్ అవకాశాలు మాకు ఇంకా ఉన్నాయి. సెమీస్ ఆడాలని మా మనస్సులో ఉంది. మేము మా ప్రణాళికలను అమలు చేయడానికి ప్రయత్నిస్తాం. లక్ష్యాన్ని ఎలా సాధించగలం అని ఓ స్పష్టతతో ఉన్నాం. గుడ్డిగా మ్యాచ్ ఆరంభించకుండా సరైన ప్రణాళికతో ముందుకు వెళతాం. మొదటి 10 ఓవర్లు ఎలా ఎలా ఆడాలి, తరువాత 20 ఓవర్లు, లక్ష్యాన్ని ఎలా సాధించాలి?, మంచి భాగస్వామ్యం, ఏ ఆటగాడు పిచ్‌లో ఎంతసేపు ఉండాలి అని చాలా విషయాలు ఉన్నాయి’ అని అన్నాడు.
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Also Read: Babar Azam Captaincy: నా కెప్టెన్సీ ఉంటుందో పోతుందో: బాబర్ ఆజామ్
‘ఫఖర్ జమాన్ 20 లేదా 30 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే మేం మా లక్ష్యాన్ని సాధించగలం. రిజ్వాన్, ఇఫ్తికార్‌లు దాన్ని కొనసాగిస్తే సునాయాసంగా విజయం సాధ్యం అవుతుంది. అదంతా సాధ్యం అవుతుందా? అని బయటవాళ్ళు అనుకుంటున్నారు. ఏ పనిలో అయినా ఆశ ఉండాలి. ఏ దశలోనైనా, మీరు చేసే ఏ పనిలోనైనా సానుకూలమైన ఆశ ఉండాలి. నేను దానిని గట్టిగా నమ్ముతాను. అందుకే పాకిస్తాన్ సెమీ ఫైనల్‌లో ఆడుతుంది అని ఆశపడుతున్నా’ అని బాబర్ ఆజామ్ చెప్పాడు.
తాజావార్తలు
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
-
Xiaomi 18 Fold: షియోమి 18 ఫోల్డ్.. 6,000mAh బ్యాటరీ.. 7.6 ఇంచెస్ డిస్‌ప్లే, 67W ఫాస్ట్ ఛార్జింగ్
-
Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!