Babar Azam: దిక్కుతోచని స్థితిలో పాకిస్థాన్ జట్టు.. కెప్టెన్‌గా బాబర్ రీఎంట్రీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Babar Azam: పాకిస్థాన్ టెస్టు జట్టు కెప్టెన్సీలో మరోసారి పెను మార్పు చోటుచేసుకుంది. పేలవమైన ప్రదర్శనతో నిరాశపరిచిన షాన్ మసూద్‌పై పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) వేటు వేసింది. అతని స్థానంలో స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్‌ను తిరిగి టెస్టు జట్టు కెప్టెన్‌గా నియమిస్తూ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడేళ్ల క్రితం పాక్ సుదీర్ఘ ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన షాన్ మసూద్.. తన కెప్టెన్సీలో జట్టును సరైన దిశలో నడిపించలేకపోయాడు. అతని నాయకత్వంలో ఆడిన 16 టెస్టుల్లో పాకిస్థాన్ ఏకంగా 12 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ నేపథ్యంలోనే పీసీబీ మళ్లీ పాత సారథి వైపే మొగ్గు చూపడం గమనార్హం. అయితే, ఇలా పదే పదే బాబర్ ఆజమ్కే కెప్టెన్సీ అప్పగిస్తుండటం పాక్ జట్టులో సరైన నాయకత్వ ప్రత్యామ్నాయాలు లేవనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
కెప్టెన్‌గా బాబర్ ఆజమ్‌కు రీ-ఎంట్రీ ఇస్తూ ఎదురవబోయే మొదటి సవాలు వెస్టిండీస్ పర్యటన. ఈ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ జట్టు కరేబియన్ గడ్డపై రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. జూలై 25 నుంచి తారౌబా వేదికగా మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. బాబర్ మళ్లీ పగ్గాలు చేపట్టడంతో ఈ సిరీస్ ద్వారా పాక్ జట్టు తన వైఫల్యాలను అధిగమించి, కొత్త ఉత్సాహంతో రాణిస్తుందని బోర్డు భావిస్తోంది. మసూద్‌ను తొలగించి బాబర్‌కు కెప్టెన్సీ ఇవ్వడంపై పాకిస్థాన్ హై-పర్ఫార్మెన్స్ డైరెక్టర్ ఆకిబ్ జావేద్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జట్టు ప్రదర్శనలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
“షాన్ మసూద్ కెప్టెన్సీలో మనం చాలా క్లోజ్ మ్యాచ్‌లు చూశాం. కానీ కొన్ని కీలకమైన లోపాలు అలాగే ఉండిపోయాయి, వాటిని ఎవరూ సరిచేయలేకపోయారు. ఉదాహరణకు సెంచూరియన్ టెస్టులో సౌతాఫ్రికాకు చెందిన 10వ నంబర్ బ్యాటర్లు ఇద్దరు ఏకంగా 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. గెలవాల్సిన మ్యాచ్ అది. అలాగే హోమ్ గ్రౌండ్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ల్లోనూ, మొల్తాన్లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులోనూ మన జట్టు చాలా సులువుగా చేతులెత్తేసింది. మ్యాచ్‌లను విజయవంతంగా ముగించాల్సిన పూర్తి బాధ్యత కెప్టెన్‌పై ఉంటుంది. అక్కడ మనం విఫలమయ్యాం” అని ఆకిబ్ జావేద్ వివరించారు.
వెస్టిండీస్ పర్యటనకు పాకిస్థాన్ టెస్ట్ జట్టు ఇదే:
బాబర్ ఆజమ్ (కెప్టెన్), అమీర్ జమాల్, అబ్దుల్లా ఫజల్, అలీ ఉస్మాన్, అజాన్ అవైస్, ఇమామ్ ఉల్ హక్, ఖుర్రమ్ షాజాద్, మహ్మద్ అబ్బాస్, మహ్మద్ అలీ, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అవైస్ జఫర్, ముహమ్మద్ ఘాజీ ఘోరీ, సాజిద్ ఖాన్, సల్మాన్ అలీ ఆఘా, షాన్ మసూద్, ఉబైద్ షా.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!