NTV Telugu Site icon

PAK: మరో మైలురాయి సాధించిన బాబర్ ఆజం.. కోహ్లీని వెనక్కి నెట్టి

Babar Azam

Babar Azam

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజం మరో మైలురాయి సాధించాడు. శుక్రవారం సెంచూరియన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్‌లను బాబర్ ఆజం వెనక్కి నెట్టాడు. టీ20ల్లో వేగంగా 11000 T20 పరుగులు సాధించాడు. ఆజం.. 298 ఇన్నింగ్స్‌ల్లోనే 11000 పరుగుల మైలురాయిని సాధించాడు. బాబర్‌కు ముందు.. 314 ఇన్నింగ్స్‌లలో ఈ ఫార్మాట్‌లో వెస్టిండీస్ లెజెండ్ గేల్ అత్యంత వేగంగా 11000 పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. అంతంకటే 16 తక్కువ ఇన్నింగ్సల్లోనే బాబర్.. గేల్ ను దాటేశాడు. తర్వాత వార్నర్ 330 ఇన్నింగ్స్‌లు, కోహ్లీ 337 ఇన్నింగ్స్‌ల్లో 11000 పరుగులు చేశారు. కాగా.. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 20 బంతుల్లో 31 పరుగులు చేసి బాబర్ ఆజం ఈ ఘనత సాధించాడు.

Read Also: Kiren Rijiju: మైనార్టీల ప‌ట్ల వివ‌క్ష లేదు.. దేశం గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి!

ఇక టీ20ల్లో 11వేల పరుగులు మార్కును ప్రపంచమొత్తం మీద కేవలం 11 మంది క్రికెటర్లే దాటారు. అందులో క్రిస్ గేల్ (14,562) టాప్‌లో ఉన్నాడు. పాకిస్తాన్ కి చెందిన షోయబ్ మాలిక్ (13,415), వెస్టిండీస్ ప్లేయర్ కీరన్ పొలార్డ్ (13,335), ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ (12,987), భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (12,886), ఆసీస్ మాజీ ప్లేయర్ డేవిడ్ వార్నర్ (12,411), ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్ (11,967), భారత ప్లేయర్ రోహిత్ శర్మ (11,830), ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ (11,458), ఇంగ్లాండ్ ప్లేయర్ జేమ్స్ విన్స్ (11,158) మాత్రమే ఈ టేబుల్‌లో ఉన్నారు. ఓవరాల్ గా వెస్టిండీస్ నుంచి ఇద్దరు, భారత్ నుంచి ఇద్దరు, పాక్ నుంచి ఇద్దరు, ఆసీస్ నుంచి ఇద్దరు, ఇంగ్లాండ్ నుంచి ముగ్గురు ఈ ఎలైట్ క్లబ్బులో నిలిచారు.

Read Also: Ulefone Tab W10: పెద్ద డిస్ప్లే.. 6600mAh బ్యాటరీతో సరికొత్త ట్యాబ్.. నాన్ స్టాప్ వీడియోలు

Show comments