Rajini ‘Baba’ Movie: ఇటీవల కాలంలో ప్రముఖ హీరోల పుట్టినరోజు సందర్భంగా వారు నటించిన సినిమాలను రీ రిలీజ్ చేయడం సాధారణమైంది. ఈ వరుసలోనే సూపర్ స్టార్ రజనీ కాంత్ చేసిన బాబా సినిమాను రీ రిలీజ్ చేశారు. రజనీకాంత్ చేసిన ప్రయోగాత్మక సినిమాల్లో ‘బాబా’ ఒకటి. ‘నరసింహా’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రజనీ మూడేళ్లు గ్యాప్ తీసుకుని ఈ చిత్రాన్ని చేశాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2002లో రిలీజై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి రజనీకాంత్ స్వయంగా కథను అందించాడు. భారీ అంచనాల నడుమ రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది. దాంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయితే ఇటీవలే 20సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాబా సినిమాను తమిళంలో రీ-రిలీజ్ చేశారు. దాదాపు 300స్ట్రీన్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శితం చేశారు. కాగా ఈ సినిమా రీ-రిలీజ్‌తో రికార్డు క్రియేట్ చేసింది. బాబా మూవీ రీ-రిలీజ్‌లో దాదాపు రూ. 4కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి రజనీ రేంజ్ తమిళనాడులో ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
#BabaReRelease grossed around 4Cr world wide in one week! Becoming one of the most Successful Re-releases of the decade!
Did good collection on par with new releases in Tamil Nadu!
— Ramesh Bala (@rameshlaus) December 17, 2022