B.Tech Student Suicide: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం దివాన్ చెరువు వద్ద గైట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్నేహితులతో అద్దెకు నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని జయశ్రీ(19) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గైట్ కళాశాలకు వెళ్లిన స్నేహితులు తిరిగి రూమ్‌కు వచ్చేసరికి ఉరేసుకున్నట్లు యువతి స్నేహితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆ విద్యార్థినిని విశాఖపట్నంలోని త్రినాధపురం గ్రామానికి చెందిన గురివల్లి జయశ్రీగా పోలీసులు గుర్తించారు. అనారోగ్య కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో మృతురాలు వెల్లడించినట్లు దర్యాప్తులో పోలీసులు తెలిపారు.
Also Read: Minister Prashanth Reddy: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి మాతృ వియోగం
విశాఖపట్నంలోని త్రినాథపురానికి చెందిన గురివల్లి జయశ్రీ(19) అనే ఓ కళాశాల విద్యార్థిని అనారోగ్య కారణాలతో బుధవారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందినట్టు బొమ్మూరు ఎస్సై జగన్మోహనరావు వెల్లడించారు. ఎస్సై వెల్లడించిన వివరాల ప్రకారం.. గైట్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న జయశ్రీ దివాన్‌చెరువులోని ఒక ఇంటిని అద్దెకు తీసుకుని స్నేహితులతో కలిసి ఉంటోంది. అయితే విశాఖపట్నంలోని అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చూపించుకుని వారం రోజుల కిందట దివాన్‌చెరువుకు జయశ్రీ తిరిగి వచ్చింది. గత వారం రోజుల్లో ఒకరోజు మాత్రమే జయశ్రీ కళాశాలకు వెళ్లింది. బుధవారం తన గదిలో ఉన్న జయశ్రీ తన స్నేహితులు కళాశాలకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిందని ఎస్సై వెల్లడించారు.
చనిపోయే ముందు తన తమ్ముడిని ఉద్దేశించి లేఖ రాసిందని పోలీసులు వెల్లడించారు. ఆ లేఖలో..”అమ్మ మనకోసం చాలా కష్టపడుతుండడం చూడలేకపోతున్నా. నా ఆరోగ్యం కూడా బాగోవడం లేదు. నువ్వు బాగా చదువుకుని అమ్మను బాగా చూసుకోవాలి” అని రాసింది. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై జగన్మోహనరావు వెల్లడించారు.