NTV Telugu Site icon

Medchal : క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి

Heart Attack

Heart Attack

గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థుల కథనం ప్రకారం… ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్‌ సీఎంఆర్‌ కళాశాలలో బీటెక్‌ 4వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్‌ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్‌లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర ఆవేదనకు గురై, కన్నీరు మున్నీరుగా విలపించారు. కుటుంబీకులు బోరున విలపించారు.

READ MORE: Off The Record : కొలికపూడి శ్రీనివాస్‌రావు పాలిట కత్తుల్లా మారిన టీడీపీ క్యాడర్..కారణం ఏంటి ?

మనం బతికున్నకాలం నిర్విరామంగా విశ్రాంతి తీసుకోకుండా పనిచేసే ఏకైక అవయవం గుండె. ఒక్క క్షణం ఆగినా శరీరంలోని ఏ భాగం పనిచేయలేదు. వందేళ్ల పాటు పనిచేసి మన ప్రాణాలను నిలబెట్టాల్సి గుండె పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని వారిలో కూడా ఆగిపోతోంది. ఇందుకు కారణాలు అనేకం. కొన్ని సార్లు చురుగ్గా, క్రమశిక్షణతో ఉండే అథ్లెట్లు హార్ట్ అటాక్‌ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే నేటితరం జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేకపోతున్నారు. శారీరక శ్రమ లోపించడం, మానసిక ఒత్తిడి వల్ల కార్టిసాల్ స్థాయి పెరిగి బీపీ రావడం, అనారోగ్యకర ఆహార అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల గుండె పనితీరుకు ఆటంకం కలుగుతోంది.

READ MORE: Uttam Kumar Reddy : ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంది.. ఇది నిబంధనలకు భిన్నం