గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్‌లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే…