ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఒక్కటే మాట వినిపిస్తుంది.. అయోధ్య రాముడిని ప్రాణ ప్రతిష్ఠ.. మరో రెండు రోజుల్లో అయోధ్య రాముడు అందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు…ఈ మహా క్రతువు కోసం దేశ ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఊరు వాడా రామ నామం తో మారుమోగుతుంది.. అయితే ఈ రామ మందిర నిర్మాణానికి పలువురు సినీ ప్రముఖులు విరాళాన్ని ఇచ్చారు.. ఎవరు ఎంత ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ప్రణీతా సుభాస్, బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి, అక్షయ్ కుమార్, , అనుపమ్ ఖేర్, హేమ మాలిని, మనోజ్ జోషి, గుర్మీత్ చౌదరి, ముఖేష్ ఖన్నా, మనీష్ ముంద్రా తదితర ప్రముఖులు రామ మందిర నిర్మాణంలో భాగం పంచుకున్నారు. మరి ఈ చారిత్రాత్మక నిర్మాణం కోసం ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో ఒక్కసారి చూద్దాం..
పవన్ కళ్యాణ్..
తెలుగు స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందుకున్నారు . ఈయన రామ మందిర నిర్మాణానికి భారీ విరాళాన్ని ఇచ్చారు.. ఈయన రూ.. 30 లక్షలకు పైగా విరాళం ఇచ్చారు పవర్ స్టార్. అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభం కాగానే అంటే 2021లోనే ఈ ఈ విరాళమందజేశారు పవన్ కల్యాణ్.. అంతేకాదు కొంతమంది నిర్మాతల చేత కూడా విరాళాన్ని అందించినట్లు తెలుస్తుంది.. మొత్తంగా పవన్ తరపున 80 లక్షల వరకు వెళ్ళాయని తెలుస్తుంది..
ప్రణీతా సుభాష్..
టాలివుడ్ హీరోయిన్ ప్రణీతా సుభాష్ కూడా రామ మందిర నిర్మాణంలో భాగం అయ్యారు.. దేశవ్యాప్త ప్రచారానికి రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారామె. ‘అయోధ్య రామమందిర నిధి సమర్పణ అభియాన్ కోసం నేను రూ. 1 లక్ష ఇచ్చాను. మీరందరూ చేతులు కలపాలి’ అని కోరింది…
అక్షయ్ కుమార్..
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం విరాళం ప్రకటించారు. అయితే ఎంతిచ్చారో స్పష్టంగా చెప్పలేదు. ‘ అయోధ్యలో రాముని మందిరం మళ్లీ ప్రారంభం కావడం చాలా సంతోషం. ఇందుకు మనందరం చేతులు కలపాలి’ అని అందరికీ పిలుపునిచ్చారు..
బిగ్ బాస్ ఫేమ్ ఆదిరెడ్డి..
తెలుగు బిగ్ బాస్ ఆరో సీజన్ కంటెస్టెంట్ ఆది రెడ్డి రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర’ ట్రస్ట్‌కు తన వంతుగా ఒక లక్ష రూపాయలు విరాళం అందించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు..
అలాగే ఇంకా..
ముఖేష్ ఖన్నా- 1.11 లక్షల రూపాయలు
మనీష్ ముంద్రా- కోటి రూపాయలు
హేమ మాలిని
గుర్మీత్ చౌదరి
గౌతమ్ గంభీర్- కోటి రూపాయలు
అనుపమ్ ఖేర్- (అయోధ్య రామమందిరానికి ఇటుకల విరాళం)
తెలిసిన సినీ ప్రముఖులు వీళ్లే, తెలియని వాళ్లు చాలా మందే ఉన్నారు..