ayodhya: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగబోతుంది. ఈ మెగా ఈవెంట్ కోసం శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రవేశ పాస్‌లను జారీ చేసింది. ఎంట్రీ పాస్‌లో క్యూఆర్ కోడ్ ఉంది.. దాన్ని స్కాన్ చేసిన తర్వాతే ఆలయ ప్రవేశానికి అనుమతి ఇస్తారని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ప్రవేశ ద్వారంలోని QR కోడ్‌తో సరిపోలిన తర్వాత మాత్రమే ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశం సాధ్యమవుతుందన్నారు.
Read Also: Andhra Pradesh: ప్రజలను అప్రమత్తం చేసిన ఏపీ ప్రభుత్వం.. 25 నుంచి వారం రోజులు ఆ సేవలు బంద్..
కాగా, ఈ ఎంట్రీ పాస్ కాపీ కూడా ట్రస్ట్‌తో షేర్ చేయబడింది. పాస్‌లో పేరు, మొబైల్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ లాంటి ముఖ్యమైన సమాచారం ఉంటుంది. ఈ వేడుకకు సంబంధించిన ఆహ్వానపత్రికలను 7 వేల మందికి ట్రస్ట్ పంపించింది. అందులో అర్చకులు, దాతలు, రాజకీయ నాయకులు సహా దాదాపు 3 వేల మంది వీవీఐపీలు ఉన్నారు. జనవరి 22న ఆలయంలో జరిగే పవిత్రోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు, మరుసటి రోజు ఆలయాన్ని ప్రజల కోసం తెరవనున్నారు.
Read Also: CM Revanth Reddy: లండన్ పర్యటలో రేవంత్ కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన యువతి
అయితే, పవిత్రోత్సవానికి మూడు రోజుల ముందు శుక్రవారం రాంలాలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. నల్లరాతితో చేసిన ఈ విగ్రహానికి కళ్లపై పసుపు గుడ్డ కట్టారు.. కొంత సమయం తర్వాత దాన్ని తొలగించారు. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల రాంలాలా విగ్రహాన్ని రాత్రి ఆలయానికి తీసుకువచ్చారు. మధ్యాహ్నం వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీరాముని విగ్రహాన్ని గర్భగుడిలో ఉంచినట్లు ప్రాణ ప్రతిష్ఠా వేడుక ప్రధాన ఆచార్య అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇప్పటికే ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నట్లు తెలిపారు. ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జనవరి 22వ తేదీన మధ్యాహ్నం 12:20 గంటలకు ప్రారంభమయి.. 1 గంటలోపు పూర్తి చేసేందుకు భావిస్తున్నట్లు ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.