Site icon NTV Telugu

Ram Mandir Ayodhya: నిఘా నీడలో అయోధ్య.. భారీగా భద్రతా ఏర్పాట్లు

Ayodhya Security

Ayodhya Security

జనవరి 22న రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ట సందర్భంగా.. అయోధ్యలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించిన వీవీఐపీల భద్రత కోసం 45 ప్రత్యేక బృందాలు గస్తీ కాస్తోంది. ప్రధాని మోదీ, పలువురు ప్రముఖులు రాక సందర్భంగా ముందే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అయోధ్య చేరుకుంది. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం నుంచి ఆలయంలోకి సామాన్య భక్తులను ఎవరిని అనుమతించరు. ప్రాణ ప్రతిష్ట జరిగిన మరుసటి రోజు నుంచి భక్తులకు రాముడి దర్శనం ఉంటుందని ఆలయ ట్రస్ట్ తెలిపింది.

Read Also: PM Modi: తన బాల్యాన్ని గుర్తుచేసుకుని ప్రధాని మోదీ కన్నీటి పర్యంతం..

మరోవైపు.. విద్రోహశక్తుల ముప్పు నేపథ్యంలో యూపీ ఏటీఎస్, కమెండో బలగాల మోహరించాయి. అంతేకాకుండా.. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఏ, ఇతర ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లు కూడా ఉన్నాయి. వారితో పాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు కూడా అయోధ్యలో మోహరించాయి. అంతేకాకుండా.. అయోధ్యలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేశారు.

Read Also: World’s Richest Family: 700 కార్లు, రూ. 4 వేల కోట్ల ప్యాలెస్, 8 జెట్స్.. ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం..

జపాన్, అమెరికా దేశాల్లో ఉపయోగిస్తున్న ఆధునిక భద్రత వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. రామాలయ ప్రాంగణం పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాల ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 319 ఫేషియల్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేశారు. కాగా.. శత్రుదుర్భేద్యంగా ఆలయ పరిక్రమ ప్రాంతం, యెల్లో జోన్ గా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. నిన్న ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను యూపీ ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.

Exit mobile version