Site icon NTV Telugu

Police Awards : రేపు ఉత్తమ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు

Police

Police

తెలంగాణ రాష్ట్రంలో విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులకు ప్రభుత్వం పలు అవార్డులు, సేవా పతకాలను రేపు ( బుధవారం, మే 10 ) ప్రదానం చేయనున్నట్లు ప్రకటించింది. రవీంద్ర భారతిలో నిర్వహించనున్న కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ అంజనీకుమార్‌ ఈ పతకాలను అందించనున్నట్లు తెలుస్తుంది.

Also Read : Vivek Agnihotri: సీఎం మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపిన “కాశ్మీర్ ఫైల్స్” డైరెక్టర్..

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే గ్యాలంటరీ అవార్డుల తరహాలోనే అత్యుత్తమ సర్వీసులు అందించే పోలీసు అధికారులకు సైతం తెలంగాణ ప్రభుత్వం గత కొద్ది సంవత్సరాలుగా ఈ అవార్డులను ప్రకటిస్తుంది. 2022 సంవత్సరానికి గాను 30 మంది పోలీస్‌ అధికారులకు అతి ఉత్కృష్ట సేవా పతకం, 28 మందికి ఉత్కృష్ట సేవా పతకం, అసాధారణ ఆసూచన కుశలత పతకం ఏడుగురికి, ఇన్వెస్టిగేషన్‌లో ప్రతిభ చూపిన ఎనిమిది మందికి హోంమినిస్టర్‌ మెడల్స్‌, ట్రైనింగ్‌ సమయంలో ప్రతిభ చూపించిన 11 మందికి హోంమంత్రి మెడల్స్‌, శౌర్య పతకం 11 మంది, మహోన్నత సేవ పతకానికి ఏడుగురు పోలీస్‌ అధికారులు ఎన్నికయ్యారు.

Also Read : TS Congress : తలసాని కామెంట్లకు కాంగ్రెస్ నేతల కౌంటర్

తెలంగాణ రాష్ట్ర ఉత్తమ సేవా పతకం-2019లో 84 మందికి, ఆంత్రిక్ సురక్ష సేవా పతకం-2019 కింద 28 మందికి పతకాలను తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేయనున్నారు. ఈ పతకాలను అందుకోనున్న వారిలో డీజీపీతో పాటు అడిషనల్‌ డీజీలు, ఇద్దరు ఐజీలు, ఒక డీఐజీ, ఒక ఎస్‌పీ, ఐదుగురు అడిషనల్‌ ఎస్పీలు, 22 మంది డీఎస్పీలు ఉన్నారు. వీరితో పాటు 39 మంది ఇన్‌స్పెక్టర్లు, 57 మంది ఎస్‌ఐలు, 31 మంది ఏఎస్‌ఐలు, 22 మంది హెడ్‌ కానిస్టేబుల్స్‌, 96 మంది కానిస్టేబుల్స్‌ ఉన్నారని అధికారులు వెల్లడించారు. రవీంద్ర భారతీ ఆడిటోరియంలో ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనుంది.

Exit mobile version