NTV Telugu Site icon

Chicken Or Mutton: చికెన్, మటన్ తిన్న తర్వాత వీటిని తింటే ప్రమాదంలో పడినట్లే.. జాగ్రత్త సుమీ!

Chicken Or Mutton

Chicken Or Mutton

Chicken – Mutton: మాంసాహార ప్రియులు చికెన్, మటన్‌ను ఎంత ఇష్టంగా తింటారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. బిర్యానీ, బాగారా రైస్, ఫ్రైలు లాంటి వంటకాలను చూడగానే నోరూరిపోతుంది. అయితే, మాంసాహారం తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల శరీరానికి అనేక హానికరమైన ప్రభావాలు కలగవచ్చు. చాలా మంది అనుకోకుండా ఈ పదార్థాలను తింటూ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా చికెన్, మటన్ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలను మిశ్రమంగా తినడం వల్ల శరీరంలో జీర్ణ సమస్యలు, శరీరంలో వేడి పెరగడం, గుండెల్లో మంట వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, మధుమేహం, యూరిక్ యాసిడ్ సమస్యలు ఉన్నవారు ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇకపోతే, మాంసాహారం తిన్న తర్వాత అస్సలు తినకూడని 3 ప్రధాన పదార్థాల గురించి తెలుసుకుందాం.

Read Also: SDLC Tragedy: సొరంగంలో చిక్కుకున్న వారి కోసం విస్తృతంగా సహాయక చర్యలు

* పాలు తాగకూడదు

చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. మాంసాహారం తినడం వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. అదే సమయంలో పాలు చల్లదనాన్ని కలిగిస్తాయి. ఈ రెండు విరుద్ధమైన లక్షణాల వల్ల జీర్ణ సమస్యలు రావడం ఖాయం. కొంతమంది మటన్ తిన్న తర్వాత పాలు తాగడం వల్ల ఛాతి శోథం, గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు.

* తేనె తినకూడదు

మటన్ తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా మేక మాంసం తిన్న తర్వాత తేనె తీసుకోవడం చాలా హానికరం. తేనె కూడా శరీర ఉష్ణోగ్రతను మరింతగా పెంచుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడం, చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మటన్ తిన్న తర్వాత తేనెను తినడం విషంతో సమానం అని చెప్పుకోవచ్చు.

* టీ తాగకూడదు

చాలామందికి భోజనం అయిన తర్వాత టీ తాగడం అలవాటు. అయితే, మటన్ తిన్న వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. టీలో ఉండే టానిన్స్ అనే పదార్థం మాంసాహారంలో ఉండే ప్రోటీన్స్‌ను కలిసి జీర్ణానికి ఇబ్బంది కలిగిస్తుంది. దీంతో అజీర్ణ సమస్యలు, గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.

Read Also: Vishnu: మా ఫ్యామిలి గొడవలకు త్వరగా ఫుల్‌స్టాప్‌ పడితే బాగుండు: మంచు విష్ణు

మాంసాహారం ఆరోగ్యానికి పోషకాలను అందించినా, దానిని తిన్న తర్వాత తీసుకునే ఆహార పదార్థాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. పాలు, తేనె, టీ లాంటి పదార్థాలను మటన్ తిన్న వెంటనే తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కాబట్టి, ఈ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి.