SRH vs RCB: విరాట్ విశ్వరూపం.. నాల్గో స్థానానికి ఆర్సీబీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs RCB: ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ విశ్వరూపం చూపించాడు. 187 పరుగుల లక్ష్యఛేదనలో ఎక్కడా ఒత్తిడికి గురికాకుండా వీర బాదుడు బాదాడు కోహ్లీ. 63 బంతుల్లో సరిగ్గా 100 పరుగులు చేసి, సన్‌రైజర్స్ ఆటగాడు భువీ బౌలింగ్‌లో అవుటయ్యాడు. కోహ్లీ స్కోరులో 12 ఫోర్లు, 4 సిక్సులు బాదాడు. ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన గేల్ రికార్డును సమం చేశాడు కోహ్లీ. ఐపీఎల్‌లో ఆరు సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
Read Also: Astrology : మే 19, శుక్రవారం దినఫలాలు
Also Read
మరో ఎండ్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా దూకుడుగా ఆడడంతో ఆర్సీబీ సునాయాసంగా నెగ్గింది. 47 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులు చేశాడు డుప్లెసిస్. చివర్లో గ్లెన్ మ్యాక్స్ వెల్ ఒక రివర్స్ స్కూప్ తో బౌండరీ సాధించడంతో ఆర్సీబీ గెలుపు ముంగిట నిలిచింది. చివరి ఓవర్లో ఆర్సీబీ విజయానికి 3 పరుగులు అవసరం కాగా… కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో ఈజీగా పరుగులు చేసిన ఆర్సీబీ విజయ ఢంకా మోగించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్…. 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆర్సీబీ మరో 4 బంతులు మిగిలుండగానే గెలుపు తీరాలకు చేరింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చెరో వికెట్ తీశారు. ఇక ఈ మ్యాచ్‌లో విజయంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరింది బెంగళూరు టీం.
తాజావార్తలు
-
Ajit Doval: ‘పహల్గామ్ దాడి తర్వాత మోడీ అడిగిన ప్రశ్న ఇదే’.. అజిత్ దోవల్ కీలక వ్యాఖ్యలు
-
Bolla Kiran : గంజాయి ముఠా గుట్టురట్టు.. బొల్లా కిరణ్ దారుణాలు వెలుగులోకి..
-
Football Club: సంచలనం.. రూ.100కే ఫుట్‌బాల్ క్లబ్ అమ్మకం..
-
BRICS Summit: ఉద్రిక్తతల వేళ.. భారత్‌కు ఇరాన్ అధ్యక్షుడు..
-
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్‌కు ఇందిరాగాంధీతో సమాధానం..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!