Avatar 2: ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న క్షణంరానే వచ్చింది. అవతార్ -2 మూవీ.. శుక్రవారం థియేటర్లలోకి రానుంది. జేమ్స్ కామోరూన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఒక్క భారత్‌లోనే ఇప్పటికే సుమారు 5 లక్షల మంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ.. అవతార్-2 మూవీ రిలీజ్‌కి ఒక్కరోజు ముందే టెలిగ్రామ్‌లో ప్రత్యక్షమైంది. భారత్ లో అవతార్-2 (ద వే ఆఫ్ వాటర్) సినిమా శుక్రవారం విడుదల అవుతుండగా, బాక్సాఫీసు వద్ద భారీ సందడి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్ లో రూ.20 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ తరహా రికార్డు ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలకే సాధ్యమైంది.
Read Also: Mega Star Chiranjeevi : రచ్చలేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’ న్యూ పోస్టర్
వాస్తవానికి ఓవర్సీస్‌లో ఇప్పటికే విడుదలైన అవతార్-2 మూవీ మిక్స్‌డ్ టాక్‌ని సొంతం చేసుకుంది. చాలా వెబ్‌సైట్లు ఇప్పటికే ఈ సినిమా రివ్యూ రాసి మూడు కంటే తక్కువ రేటింగ్ ఇచ్చాయి. 13 ఏళ్ల క్రితం వచ్చిన అవతార్-1 కంటే ఈ మూవీ ఏమంత గొప్పగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా నిడివి ఎక్కువగా ఉండటంతో తమ ఓపికకి డైరెక్టర్ పరీక్ష పెట్టాడని కొంత మంది నెటిజన్లు చెప్తుండగా.. ఓ కార్టూన్ సినిమా చూసినట్లు ఉందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. శుక్రవారం తొలి రోజు దేశవ్యాప్తంగా అవతార్-2 సినిమా రూ. 40-50 కోట్లను వసూలు చేయచ్చని అంచనా. మరే హాలీవుడ్ సినిమాకు భారత్ లో ఈ ఘనత సాధ్యపడలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సానుకూల అభిప్రాయాలు, రివ్యూలు వస్తుండడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా పైరసీ కాపీ లీక్ అయినట్టు సమాచారం వ్యాప్తి చెందుతోంది. అయితే గ్రాఫిక్స్ ఆధారిత చిత్రం కనుక థియేటర్లలో చూసిన అనుభవం ఫోన్లలో, కంప్యూటర్లలో చూసినప్పుడు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
