Mega Star Chiranjeevi : రచ్చలేపుతున్న ‘వాల్తేరు వీరయ్య’ న్యూ పోస్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mega Star Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో చిరుతో పాటు మాస్ రాజా రవితేజ స్ర్కీన్ షేర్ చేసుకోవడంతో సినిమా ఓ హైప్లోకి వెళ్లింది. ఇప్పటికే రిలీజైనా పాట సోషల్ మీడియాని ఓ ఊపు ఊపేస్తోంది. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చిరు సరసన తొలిసారి నటిస్తోంది. యువ దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. ముఠామేస్త్రి తరహాలో చిరంజీవి పూర్తి స్థాయి మాస్ పాత్రలో నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా వాల్తేరు వీరయ్య నుంచి చిరు లేటేస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర మేకర్స్. ప్యాంటు, చొక్కా వేసుకొని, కళ్ల జోడుతో పోలీస్ స్టేషన్ లో టేబుల్ పై చిరు స్టయిల్ గా కూర్చున్న పోస్టర్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇందులో చిరు ముందు ఓ తుపాకీ, వెనకాల వరుసగా మరికొన్ని తుపాకులు ఉన్నాయి. హ్యాండ్ కప్స్ ను ఒక చేతిలో పట్టుకున్న చిరు స్టిల్ అదిరిపోయింది. ఈ పోస్టర్ శాంపిల్ మాత్రమేనని, ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ మొత్తం థియేటర్లలో పూనకాలు తెప్పించడం పక్కా అని బాబీ పేర్కొన్నారు.
Presenting you all the new Avatar of our Megastar @Kchirutweets in #WaltairVeerayya 🔥
Also Read
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
- Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
Ee poster Sample matrame, I promise ee episode motham POONAKALU guarantee in theatres 😎
Spot the Standees at your nearest theatres,
Click your selfies and tag #WaltairVeerayyaOnJan13th 👍🏻 pic.twitter.com/9l24d13CbX— Bobby (@dirbobby) December 16, 2022
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
-
Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
ట్రెండింగ్
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?