Site icon NTV Telugu

AV Subba Reddy: టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. అవును.. ఆ కోవర్టును నేనే..!

Av Subba Reddy

Av Subba Reddy

AV Subba Reddy: టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఆరోపించే కోవర్టును నేనే అన్నారు.. తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.. అయితే, ఆళ్లగడ్డ సీటు గురించి చంద్రబాబు చెవిలో చెప్పాడని అఖిలప్రియ చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఆళ్లగడ్డ నుండి పోటీ చేయాలని ఎప్పటి నుండో ఆసక్తిగా ఉంది… పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆళ్లగడ్డ నుండి పోటీ చేస్తా, భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇక, పార్టీపై గౌరవంతోనే ఆళ్లగడ్డ సభకు వెళ్లలేదు.. భయపడి కాదని స్పష్టం చేశారు ఏవీ సుబ్బారెడ్డి.. భూమా అఖిలప్రియ అల్టిమేటంకు , బెదిరింపులకు భయపడే రకం నేను కాదన్న ఆయన.. సమిష్టి కృషి వల్లనే ఆళ్లగడ్డలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సభ విజయవంతం అయ్యిందన్నారు. మరోవైపు.. ముస్లింలను కించపరస్తు మాట్లాడిన శిల్పా మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు టీడీపీ సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డి. కాగా, ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బా రెడ్డి కుటుంబాల మధ్య వివాదాలు కొనసాగుతోన్న విషయం విదితమే. ఏవీ సుబ్బారెడ్డి తాజాగా చేసిన కామెంట్లను వినేందుకు కింది వీడియోను క్లిక్‌ చేయండి..

Exit mobile version