ప్రతి తండ్రికీ తన కూతురు అంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. తండ్రితో కూతురి బంధం, తల్లితో కొడుకు అనుబంధం సాధారణంగా చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లల కోసం తల్లిదండ్రులు చాలా చేస్తూ ఉంటారు. వారికి ఏది కావాలంటే అది కొనిస్తూ ఉంటారు. ఇక వారి పుట్టినరోజు వచ్చిందంటే వేలకు వేలు, లక్షలకు లక్షలు ఖర్చు చేసి పార్టీ చేస్తూ ఉంటారు. పార్టీలు లాంటివి చేతినిండా డబ్బులు, అకౌంట్లలో లక్షలు ఉంటే బాగానే ఉంటాయి. మరి డబ్బులు లేకపోతే. అయినా పర్వాలేదు. పుట్టిన రోజు చేయాలి అనే మనసుంటే భిన్నమైన ఆలోచనలు అవే పుట్టుకొస్తాయి.
ఓ పేద ఆటో డ్రైవర్ అయిన తండ్రి తన కూతురు బర్త్ డేని వినూత్నంగా సెలబ్రేట్ చేశాడు. దీనికి సంబంధించిన వివరాలను ఐఎఎస్ అధికారి అవనీష్ శరణ్ ఎక్స్ లో షేర్ చేశారు. మనిషి మనసు గొప్పగా ఉండటానికి డబ్బులే ఉండనక్కర్లేదు, హ్యాపీ బర్త్ డే అర్పిత అని దానికి క్యాప్షన్ జోడించారు అవనీష్ శరణ్. ఆయన షేర్ చేసిన పోస్ట్ లో ‘ఈ రోజు తేదీ 11/08/2023 మా అమ్మాయి రాణి అర్పిత మాదవ్ పుట్టిన రోజు. ఈ శుభసందర్భంలో ఈ రోజు నా ఆటోలో ఫ్రీగా తిరగొచ్చు. ఎటువంటి డబ్బులు ఇవ్వనవసరం లేదు. హ్యాపీ బర్త్ డే’ అని రాసి ఉంది.
Also Read: Madhya Pradesh: జెండావందనం రోజు అపశృతి.. సొమ్మసిల్లి పడిపోయిన స్పీకర్, మంత్రి
కూతురి బర్త్ డే కోసం ఎక్కువ ఖర్చు చేయలేని ఆ తండ్రి వినూత్నంగా ఇలా ఒక రోజు ఫ్రీ సర్వీస్ చేయడం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఇలాంటి తండ్రి ఉన్నందుకు నువ్వు చాలా లక్కీ అంటూ అర్పితకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఆగస్టు 13వ తేదీన పోస్ట్ అయిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌ను ఇప్పటివరకు కొన్ని లక్షల మంది వీక్షించారు, వేల మంది లైక్ చేశారు. ఈ పోస్ట్ చూసిన వారందరూ ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకన్నా సంతోషం ఏముంటుందని కొందరు అంటుంటే, గొప్ప తండ్రీ అంటూ మరికొందరు పొగుడుతున్నారు.
आदमी का दिल बड़ा होने के लिए जेब का बड़ा होना ज़रूरी नहीं.❤️
Happy Birthday Arpita. pic.twitter.com/H8PhPSHRLN— Awanish Sharan 🇮🇳 (@AwanishSharan) August 13, 2023