Kakinada Ship: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీంను కలెక్టర్ ఏర్పాటు చేశారు. రేషన్ బియ్యం విషయంలో అధికారుల వైఫల్యం ఉందని.. షిప్‌ను సీజ్ చేశామని కలెక్టర్ వెల్లడించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు చేస్తున్నామని.. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా తరలించారో తేలుస్తామని కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ చెప్పారు. ఎగుమతిదారు ఎవరు.. ఏ గోదాములో బియ్యం ఉన్నాయో పరిశీలిస్తామన్నారు. బ్యాంకు గ్యారంటీతో విడుదల చేసిన బియ్యం షిప్‌లో ఉన్నాయో లేదో నిర్ధారిస్తామన్నారు.
Read Also: Tragedy: విషాదం.. తండ్రి మందలించాడని పురుగుల మందు తాగిన పదేళ్ల బాలుడు
సోమవారం పోర్టు నుంచి బియ్యం తరలింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించిన సంగతి తెలిసిందే. మరో వైపు రేషన్ బియ్యం మాఫియాపై నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు చర్చించారు. రేషన్ బియ్యం తరలింపును వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని నిర్ణయించారు.