Ration Mafia : ఏపీలో రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ రంగంలోకి దిగింది. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం అక్రమ రవాణా పై సిట్ ఏర్పాటైంది. దీంతో మాఫియా గుండెల్లో గుబులు మొదలయ్యాయి. ప్రస్తుతం స్టెల్లా నౌక నుంచి సేకరించిన బియ్యం నమూనాలను పరిశీలిస్తూ సిట్ విచారణ వేగంగా సాగే అవకాశముంది. అక్రమాలకు అండదండగా ఉన్న పెద్దలపాత్ర త్వరలో బయటపడే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న అన్ని పోర్టులలోనూ కాకినాడ పోర్టు వివాదాలతో చిక్కుకుంది. కాకినాడ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీల తర్వాత అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్టులో స్టెల్లా షిప్‌ను అధికార యంత్రాంగం సీజ్ చేసింది. ఐదు శాఖల అధికారులతో కలిపి మల్టీ డిసిప్లినరీ కమిటీని జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఏర్పాటు చేశారు.