Andhra Pradesh: గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. మరింత ఈజీగా సర్టిఫికెట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: సర్టిఫికెట్స్ కోసం రోజుల తరబడి అధికారుల వెంట తిరగాల్సి వస్తుందా? స్కూల్, కాలేజ్, ఉద్యోగం మానేసి సర్టిఫికెట్స్ కోసం ప్రయత్నాలు సాగించాల్సిన పరిస్థితి వచ్చిందా? ఇక నో టెన్షన్.. ఎందుకంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విద్య, ఉద్యోగం, ప్రభుత్వ పథకాలతో పాటు ఇతర అవసరాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల వారికి జారీ చేసే వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీని మరింత సులభతరం చేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్.. ఈ మేరకు సీఎస్ కేఎస్ జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్, నివాస ధృవపత్రం, బర్త్ డే సర్టిఫికెట్‌కాకుండా.. ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ఒకసారి తీసుకుంటే సరిపోతుందని క్లారిటీ ఇచ్చారు.
Read Also: Gold Price Today: మహిళలకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే?
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
- Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- Mumbai Indians: ఆటగాళ్లకు ముంబై మేనేజ్మెంట్ లాస్ట్ వార్నింగ్.. ఫ్రాంచైజీతో ఆడుకుంటే ఇకపై తరిమి కొట్టడమే..
- Abhishek Banerjee: "నా గొంతు కోసినా సరే, మీకు లొంగేది లేదు".. చిక్కుల్లో మమత మేనల్లుడు
ఇక, ఒకసారి పొందిన సర్టిఫికెట్లను శాశ్వత ధ్రువీకరణ పత్రాలుగా పరిగణించాలని, ప్రతిసారీ కొత్త సర్టిఫికెట్ కోసం ఒత్తిడి తేవద్దని పాఠశాల, ఉన్నత, సాంకేతిక, వైద్య విద్య శాఖలు, స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయ శాఖలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. ఈ సర్టిఫికెట్లు ఎక్కడైనా పోయినా, వాటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. గ్రామ, వార్డు సచివాలయం లేదా మీ సేవా కేంద్రాల్లో అదే నంబర్‌తో కొత్తది పొందే వెసులుబాటు కూడా కల్పించింది వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్. కాగా, వివిధ రకాల సర్టిఫికెట్స్ కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించిన విషయం విదితమే.. తహసీల్దార్, ఎంపీడీవోలతో సహా వివిధ మండల స్థాయి అధికారుల ఆధ్వర్యంలో సచివాలయాల వారీగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి.. వలంటీర్లతో పాటు సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించడంతో పాటు.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వివిధ రకాల వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాల జారీకి వినతులను సేకరించడం.. వారికి వెంటనే వివిధ రకాల సర్టిఫికెట్లు అందించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Cuba vs America: క్యూబాలో నాయకత్వ మార్పు? ఫిడెల్ కాస్ట్రో కుమార్తె సంచలన వ్యాఖ్యలు!
-
Lashkar-e-Taiba: భారత్‌ను టార్గెట్ చేస్తూ బార్డర్ల కొత్త ఉగ్ర కోట.. నిఘా వర్గాల చేతికి లష్కర్ సీక్రెట్ మ్యాప్!
-
Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి బ్రేక్.. వీక్ నెస్ పట్టేసిన బౌలర్లు.. పాపం బుడ్డొడు..
-
Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..