NTV Telugu Site icon

IND vs AUS: ఉత్కంఠభరిత పోరులో భారత్ పరాజయం..

Maxi

Maxi

ఆస్ట్రేలియాతో 5 టీ20 సిరీస్ లో భాగంగా.. టీమిండియా మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. 5 వికెట్ల తేడాతో ఇండియాపై ఆసీస్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన ఆసీస్.. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ పోరులో ఆస్ట్రేలియానే విజయం వరించింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (35), ఆరోన్ హార్డీ (16) పరుగులు చేశారు. ఆ తర్వాత జోష్ ఇంగ్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన మ్యాక్స్ వెల్ (104) సెంచరీ చేశాడు. దీంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక.. భారత్ బౌలర్లలో రవి బిష్ణోయ్ 2 వికెట్లు పడగొట్టగా.. అర్ష్ దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.

Shakeela: మొన్న విచిత్ర.. నేడు షకీలా.. ఆయన నన్ను రూమ్ కు రమ్మన్నాడు

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ ఈ మ్యాచ్ లో ఓడిపోయింది. టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (6), రుతురాజ్ గైక్వాడ్ (123) సెంచరీతో చెలరేగాడు. ఇషాన్ కిషన్ డకౌట్ రూపంలో వెనుతిరగగా.. సూర్యకుమార్ యాదవ్ 39 పరుగులతో రాణించాడు. చివరలో తిలక్ వర్మ 31 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా బౌలర్లలో కానే రిచర్డ్ సన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆరోన్ హార్డీ తలో వికెట్ సాధించారు. కాగా.. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా గెలుపుతో 2-1తో సిరీస్ ఆశలను ఆసీస్ పదిలం చేసుకుంది.

Extra Jabardasth: ‘జబర్దస్త్’ జడ్జ్ మారింది.. ఖుష్బూ స్థానంలో ఆ హీరోయిన్!