Site icon NTV Telugu

IND vs AUS: ఆస్ట్రేలియా టార్గెట్ 241.. భారం బౌలర్లపైనే..!

Match

Match

IND vs AUS: ప్రపంచకప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఉన్నంతసేపు స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. ఈ మ్యాచ్ లో భారీ స్కోరును ఊహించుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఆసీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు తడబడటంతో.. తక్కువ స్కోరును నమోదు చేశారు. టీమిండియా బ్యాటింగ్ లో కేఎల్ రాహుల్ (66) అత్యధిక స్కోరు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47), సూర్యకుమార్ యాదవ్ (18) పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లంతా 10 పరుగుల లోపే ఔటయ్యారు. భారత్ ఇన్నింగ్స్ లో 11 ఓవర్ల నుంచి 40 ఓవర్ల మధ్య కేవలం రెండు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. దీనిబట్టి అర్ధం చేసుకోవచ్చు. ఆసీస్ బౌలర్లు ఎలా విరుచుకుపడ్డారనేది. ఇక.. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత జోష్ హేజిల్ ఉడ్, పాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు సంపాదించారు. మ్యాక్స్ వెల్, జంపాకు కూడా చెరో వికెట్ లభించింది.

Read Also: Kodali Nani : టీడీపీకి బీ టీమ్ దగ్గుబాటి పురంధరేశ్వరి

టాస్ ఓడి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా.. భారత్ ను బ్యాటింగ్ కు పంపింది. ఈ క్రమంలో ఆరంభంలో రోహిత్ శర్మ దూకుడు ఇన్నింగ్స్ ఆడి.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ 47 పరుగుల వద్ద భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో క్యాచ్ ఔటయ్యాడు. అంతకుముందు గిల్ 4 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇక.. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన పోయిన మ్యాచ్ లో సెంచరీ హీరో కేవలం 4 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత కోహ్లీ, కేఎల్ రాహుల్ ఆచితూచి ఆడి స్కోరుబోర్డును నడిపించారు. ఆ తర్వాత జడేజా 9 పరుగులు చేసి ఔటయ్యాడు. సూర్యకుమార్ 18 పరుగులు పెవిలియన్ బాట పట్టాడు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు భారమంతా టీమిండియా బౌలర్లపైన ఉంది. మొదట్లో బుమ్రా, సిరాజ్ వికెట్లు తీస్తే.. ఆ తర్వాత మహమ్మద్ షమీ కూడా వికెట్లు తీయగల సత్తా ఉంది.

Exit mobile version