Ashes Series 2025: యాషెస్ సమరానికి సై.. పెర్త్ వేదికగా నేటి నుంచే తొలి టెస్టు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashes Series 2025: క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘యాషెస్’ (Ashes) సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య నేటి (నవంబర్ 21) నుంచి పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. నువ్వా.. నేనా.. అన్నట్లు సాగే ఈ చారిత్రక పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2017 నుంచి ప్రతిష్టాత్మక యాషెస్ ‘ఉర్న్’ (Urn) ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ముఖ్యంగా ఆసీస్ గడ్డపై ఇంగ్లండ్ రికార్డు అంతగా బాగా లేదు. 2010-11లో సాధించిన చారిత్రక విజయం తర్వాత ఇంగ్లండ్ జట్టు ఆస్ట్రేలియాలో ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. పైగా గత మూడు పర్యటనల్లో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోర పరాజయాలను చవిచూసింది. అయితే, 2019, 2023లో స్వదేశంలో జరిగిన సిరీస్‌లను డ్రాగా ముగించి గట్టి పోటీనిచ్చింది. ఈసారి తమ దూకుడైన ‘బజ్‌బాల్’ (Bazball) ఆటతో కంగారూలను వారి సొంత గడ్డపైనే ఓడించి, పాత బాకీ తీర్చుకోవాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
Also Read
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ఆస్ట్రేలియా జట్టులో ఇద్దరు అరంగేట్రం తొలి టెస్టు కోసం ఆస్ట్రేలియా తమ తుది జట్టును (Playing XI) ఇప్పటికే ప్రకటించింది. స్టీవ్ స్మిత్ తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్‌లో.. ఓపెనర్ జేక్ వెదరాల్డ్, ఫాస్ట్ బౌలర్ బ్రెండన్ డాగెట్ టెస్టుల్లో అరంగేట్రం (Debuts) చేయనున్నారు. ఇక మరోవైపు ఇంగ్లండ్ గతంలోలా కాకుండా.. ఈసారి ఇంగ్లండ్ తమ తుది జట్టును (XI) నేరుగా ప్రకటించకుండా కేవలం 12 మంది సభ్యుల స్క్వాడ్‌ను మాత్రమే వెల్లడించింది. బెన్ స్టోక్స్ సారథ్యంలోని ఇంగ్లండ్ జట్టులో జో రూట్, హ్యారీ బ్రూక్, జోఫ్రా ఆర్చర్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు.
ఆస్ట్రేలియా స్క్వాడ్: జేక్ వెదరాల్డ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, కామెరాన్ గ్రీన్, అలెక్స్ కేరీ, మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, స్కాట్ బోలాండ్, బ్రెండన్ డాగెట్.
ఇంగ్లండ్ స్క్వాడ్: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆల్లీ పోప్, జో రూట్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), మార్క్ వుడ్.
తాజావార్తలు
-
Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
-
Delhi: చాట్‌జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
-
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్‌కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!