Australia: మామూలుగా రోడ్డుపై వెళ్తుంటే పదిరూపాయలు దొరికితే చటుక్కున తీసుకుని జేబులో వేసుకునే రోజులివి. అలాంటిది నిద్రలేచి చూసే సరికి కోట్ల కొద్ది డబ్బు బ్యాంకులో జమైతే ఇంకా ఏమైనా ఉందా.. వాటితో ఏం చేయాలా అంటూ ఊహల్లో తేలిపోము. అప్పటివరకు మనకు లేని వస్తువులన్నీ కొనుక్కుని ఎంజాయ్ చేస్తాం కదా.. అదే ఇక్కడ ఓ యువకుడు చేశాడు.. కానీ కథ అడ్డం తిరిగింది.. ఆ డబ్బు అసలు హక్కు దారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం తెలిసింది. కానీ అప్పటికే ఉన్న సొమ్మంతా ఊడ్చుకుపోయింది. ఇంకే హక్కు దారుడి ఫిర్యాదుతో సదరు యువకుడికి జైలు శిక్ష పడింది. అందుకే దొరికిన సొమ్ము అయినా సరే కాస్త ఆగి ఆలోచించి ఖర్చు చేసుకోవాలి లేకుంటే మనోడి లాగే చిక్కుల్లో పడాల్సి వస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని అబ్దెల్ గాడియా ఖాతాలో రూ.4.6 కోట్లు పొరపాటున జమయ్యాయి. ఆ మొత్తాన్ని చూసి అతడు షాక్ అయ్యాడు. వెంటనే అన్నీ ఖర్చుపెట్టే పనిలో పడ్డాడు. బంగారు బిస్కెట్ల నుంచి మేకప్, డిజైనర్ దుస్తులు ఇలా ఎన్నో వస్తువులు కొన్నాడు. ఎక్కడ నుంచి ఈ పౌండ్లు వచ్చాయి, ఎవరు పంపించారు అన్న విషయాలు పట్టించుకోలేదు.
Read Also: Christmas Gift : ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రూ.80లక్షల బోనస్
అబ్దేల్ ఘడియా అకౌంట్ లో జమ అయిన డబ్బును తార త్రోన్ అనే న్యుట్రీషనిస్ట్, ఆమె భర్త కోరేది. ఈ దంపతులు సిడ్నీలోని ఉత్తర బీచ్ లో ఓ ఇల్లు కొనుకోవ్వడానికి దాచుకున్నారు. ఆడమ్ మార్గో అనే మధ్యవర్తి ద్వారా ఇల్లు కొనుగోలు చేయడానికి డబ్బులు పంపించబోయి పొరపాటున వేరే అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఆ క్యాష్ డిపాజిట్ అయిన అకౌంట్ అబ్దేల్ ఘడియాది. ఘడియా వెంటనే డబ్బును స్వాహా చేశాడు. ఇలా వచ్చిన డబ్బునే ఆ యువకుడు తన ఇష్టానుసారంగా ఖర్చు చేసేశాడు. గత ఏడాది జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also: lokesh kanagaraj: నిర్మాతలుగా మారబోతున్న ముగ్గురు దర్శకులు
రూ.4.6 కోట్ల డబ్బు మొత్తం అబ్దేల్ బ్యాంక్ అకౌంట్లోకి జమ అయ్యాయని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నగదును తిరిగిచ్చేయాలని యువకుడు అబ్దేల్ కు పోలీసులు సూచించారు. తాను తప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు. కాని నగదు బదిలీ విషయంతో తనకు సంబంధం లేదని తెలిపాడు. ప్రస్తుతం తన వద్ద డబ్బు లేదని, ఆ మొత్తాన్ని తనకు కావాల్సిన బంగారం కొనేందుకు ఖర్చుచేశాడు. మిగతా నగదును డ్రస్సులు, ఇతర అవసరాలకు వాడుకున్నాడు. ప్రేమించిన వారికి బంగారం ఇచ్చేశానని, తన చేతిలో ఏమీ మిగల్లేదని చెప్పినట్లు డైలీ టెలిగ్రాఫ్ రిపోర్ట్ చేసింది. ఈ కేసులో నిందితుడికి 18 నెలల జైలు శిక్ష విధించారు. దీనితో పాటు 10 నెలల నాన్-పెరోల్ గడువు విధించారు. బంగారం ఎవరికి ఇచ్చాడో పోలీసులు కనుక్కోలేకపోయారు. యువకుడు ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్నాడు.
