Site icon NTV Telugu

Social Media Ban: 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా నిషేధం.. పిల్లల ఖాతాలను వెంటనే బ్లాక్ చేయాలని ప్రభుత్వం ఆదేశం

Australia

Australia

సోషల్ మీడియా వాడకం కామన్ అయిపోయింది. సామాజిక మాద్యమాల్లో గంటలు గంటలు గడుపుతున్న వారి సంఖ్య ఎక్కువై పోతోంది. దీని వల్ల పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో పలు దేశాల్లో పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే డిమాండ్ లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఇంటర్నెట్ మీడియాను పూర్తిగా నిషేధించింది ఆస్ట్రేలియా. ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి టిక్‌టాక్ , ఆల్ఫాబెట్ ఇంక్, యూట్యూబ్, మెటా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో సహా అనేక ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయకుండా పిల్లలకు నిషేదం విధించారు.

Also Read:Jasprit Bumrah: 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా.. జస్‌ప్రీత్ బుమ్రా నయా రికార్డు

కొత్త చట్టం ప్రకారం, పది అతిపెద్ద ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను బ్లాక్ చేయాలని లేదా $33 మిలియన్ల వరకు జరిమానా విధిస్తామని ఆదేశించింది. ఈ చట్టాన్ని ప్రధాన టెక్నాలజీ కంపెనీలు, వాక్ స్వాతంత్య్ర న్యాయవాదులు విమర్శించారు, కానీ తల్లిదండ్రులు, పిల్లల హక్కుల న్యాయవాదులు దీనిని స్వాగతించారు. 16 ఏళ్లలోపు పిల్లలకు ఇంటర్నెట్ మీడియాపై నిషేధం విధించడం వల్ల పిల్లలకు వారి బాల్యం లభిస్తుందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ఇంటర్నెట్ మీడియా నిషేధానికి మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర, స్థానిక నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతిని అందించడానికి, ఆస్ట్రేలియన్ పిల్లలకు సురక్షితమైన బాల్యం ఉండేలా చూసుకోవడానికి ఆస్ట్రేలియాకు అవసరమైన సాంస్కృతిక మార్పు ఇదేనని ఆయన అన్నారు.

రాబోయే పాఠశాల సెలవులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిల్లలను కోరారు. వారి ఫోన్‌లలో సమయం గడపడానికి బదులుగా, కొత్త క్రీడలను నేర్చుకోవాలని, కొత్త వాయిద్యం, పుస్తకాన్ని చదవండి. ముఖ్యంగా, స్నేహితులు, కుటుంబ సభ్యులతో మీ సమయాన్ని గడపండి అని సూచించారు. ఈ ఆంక్షల వల్ల టీనేజర్లు ఎక్కువగా ప్రభావితమవుతారు. వారి కనెక్షన్ పూర్తిగా ఇంటర్నెట్ మీడియాపై ఆధారపడి ఉంటుంది. సెలవుల్లో తమ సుదూర స్నేహితులతో ఎలా కనెక్ట్ అవ్వాలో అని ఆందోళన చెందుతున్నారు.

Also Read:మినీ థియేటర్ మీ ఇంట్లోనే.. తక్కువ బడ్జెట్‌‌లో Onida’s Nexg 55UZI 4K Ultra HD Google TV

సిడ్నీకి చెందిన 15 ఏళ్ల నోహ్ జోన్స్, మైసీ నేలాండ్ కోర్టులో చట్టాన్ని సవాలు చేశారు. ఈ నియమం దేశంలోని సుమారు 2.6 మిలియన్ల మంది యువకుల భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తుందని వాదిస్తున్నారు. అయితే, ఇంటర్నెట్ మీడియా హానికరమైన ప్రభావాల నుండి పిల్లలను రక్షించడానికి చాలా మంది తల్లిదండ్రులు ఈ చర్యకు మద్దతు ఇస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది.

Exit mobile version