NTV Telugu Site icon

AUS vs IND: హ్యాట్రిక్‌ కొట్టనివ్వం.. టీమిండియాను నిశ్శబ్దంగా ఉంచుతాం: కమిన్స్

Pat Cummins

Pat Cummins

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని భారత్ హ్యాట్రిక్‌ కొట్టనీయకుండా చూస్తామని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అంటున్నాడు. మైదానంలో భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే తాము దృష్టిసారించాం అని తెలిపాడు. మమ్మద్ షమీ లేకపోవడం భారత జట్టుకు నష్టమేనని తెలిపాడు. భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరకుండా అడ్డుకుంటామని కమిన్స్ చెప్పుకొచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్‌కు ముందు కమిన్స్ సవాల్ చేసిన విషయం తెలిసిందే. మైదానంలో టీమిండియా అభిమానులను నిశ్శబ్దంగా ఉంచుతాం అని చెప్పి మరీ చేశాడు. ఇప్పుడు మరోసారి అలాంటి సవాలే చేశాడు.

ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాట్ కమిన్స్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ‘బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ కోసం మేం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పటివరకు అంతా సాఫీగా సాగుతోంది. గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తాం. ఈసారి ఎలాగైనా ట్రోఫీని కైవసం చేసుకుంటాం. సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం ఎప్పటికీ ప్రత్యేకమే. గత రెండుసార్లు భారత్‌ ట్రోఫీ గెలవడంతో ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. మా జట్టులోని కొన్ని స్థానాలపై చర్చ సాగుతోంది. డేవిడ్ వార్నర్‌ను ఎవరితో భర్తీ చేయాలో చూడాలి. మా ఆటగాళ్ల విషయంలో స్పష్టతతో ఉన్నాం. కామెరూన్ గ్రీన్ లేకపోవడం మాత్రం మాకు కాస్త ఇబ్బందే’ అని కమిన్స్ తెలిపాడు.

Also Read: AUS vs IND: అయ్యో రాహులా.. మరీ 4 పరుగులేనా! ఇలా అయితే కష్టమే

‘మమ్మద్ షమీ గాయం కారణంగా దూరం కావడం భారత్‌కు పెద్ద లోటే. క్రికెట్‌లో ఇలాంటివి సర్వసాధారణమే. ఒకరి స్థానంలో మరొక ప్లేయర్ సిద్ధంగా ఉంటారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఫామ్‌లో లేరు. కానీ వారిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయొద్దు. టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌ను నిశ్శబ్దంగా ఉంచడం పైనే మేం దృష్టిసారించాం. రిషబ్ పంత్ డేంజర్‌ అని గతంలోనే చెప్పా. మరోసారి అదే చెబుతున్నా. ఆస్ట్రేలియా అంటే అతడు ఊగిపోతాడు. ఈసారి మాత్రం పంత్‌కు చెక్ పెడతాం. భారత ప్లేయర్స్ పేస్‌ పిచ్‌లపై బాగా ఆడుతున్నారు. పెర్త్, అడిలైడ్‌లో వారిని నిలువరిస్తామని అనుకుంటున్నా. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవడంపై ఇప్పుడే దృష్టి సారించడం లేదు’ అని కమిన్స్ చెప్ప్పుకొచ్చాడు.