NTV Telugu Site icon

AUS vs IND: ఆస్ట్రేలియాకు షాక్.. పెర్త్ టెస్ట్‌కు కీలక వ్యక్తి దూరం! కారణం ఐపీఎల్

Australia Test

Australia Test

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25 నవంబర్ 22న ఆరంభం కానుంది. ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్ల సిద్దమవుతున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు వెళ్లాలంటే ఈ సిరీస్ అటు ఆసీస్, ఇటు టీమిండియాకు అత్యంత కీలకం. అందుకే మొదటి టెస్టులోనే గెలిచి సిరీస్‌పై పట్టుసాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. పెర్త్ టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానుండగా.. ఆస్ట్రేలియా కూడా ఓ కీలక వ్యక్తి సేవలను కోల్పోనుంది.

ఆస్ట్రేలియా అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరి పెర్త్ టెస్ట్‌కు అందుబాటులో ఉండడం లేదు. ఐపీఎల్ 2025 మెగా వేలం కారణంగా వెటోరి తొలి టెస్ట్‌కు దూరమవుతున్నాడు. న్యూజీలాండ్ మాజీ కెప్టెన్ వెటోరి ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు హెడ్ కోచ్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నవంబర్ 24, 25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జడ్డాలో జరగనుంది. అదే సమయంలో ఆస్ట్రేలియా, భారత్ తొలి టెస్ట్ జరగనుంది. సన్‌రైజర్స్ తరఫున వెటోరీ మెగా వేలంలో పాల్గొని ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు.. పెర్త్ టెస్ట్‌కు తాను అందుబాటులో ఉండడని ఇప్పటికే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)కు చెప్పాడట. ఇందుకు సీఏ కూడా అంగీకరించింది.

Also Read: RCB Coach: ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు కానీ.. ఆర్‌సీబీకి కోచ్‌గా ఎంపికయ్యాడు!

‘సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్ కోచ్ డానియల్ వెటోరికి మేం అండగా ఉంటాం. ఐపీఎల్ 2025 వేలంలో పాల్గొనేందుకు వెటోరికి అనుమతి ఇచ్చాం. పెర్త్ టెస్ట్‌ కోసం జట్టు ప్రిపరేషన్‌ను కాస్త ముందుగానే ముగించనున్నాడు. ఐపీఎల్ వేలం ముగిసిన తర్వాత మళ్లీ ఆస్ట్రేలియా జట్టుతో కాలుస్తాడు. బోర్డర్-గవాస్కర్ 2024 ట్రోఫీ పూర్తయ్యేవరకు వెటోరి అందుబాటులో ఉంటాడు’ అని సీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు.