Updated Income Tax Bill: 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం తీసుకొచ్చేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 13న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను నూతన బిల్లు 2025ను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకొని, అప్డేట్ చేసి మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని నిర్ణయించినట్లు కొన్ని జాతీయ పత్రికలు వెల్లడించాయి. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును అధ్యయం చేసి జులై 21న మొత్తం 4500 పేజీలతో కూడిన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించింది. సెలెక్ట్ కమిటీ ఈ నివేదికలో ముసాయిదా బిల్లుకు 285 ప్రతిపాదనలు చేసింది. కేంద్రం వాటిని పరిగణనలోకి తీసుకుని దానికి అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ అప్డేటెడ్ బిల్లును ఆగస్టు 11న(సోమవారం) లోక్‌సభ ముందుకు తీసుకురావాలని నిర్ణయించినట్లు సమాచారం.
READ MORE: Su from So OTT : పెట్టిన బడ్జెట్ కి డబుల్ అడుగుతున్నారు!
సెలెక్ట్ కమిటీ ప్రధాన సూచనలు..
1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, 66 బడ్జెట్లలో (రెండు మధ్యంతర బడ్జెట్లు కలిపి) ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో సంక్లిష్టంగా తయారైంది. పన్ను చెల్లింపుదార్లకు వ్యయాలూ పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఆ మేరకు కొత్త బిల్లును రూపొందించారు. సెలెక్ట్ కమిటీ నూతన ఆదాయపు పన్ను బిల్లుకు చేసిన కొన్ని ప్రధాన సూచనలు.. టీడీఎస్, టీసీఎస్ రీఫండ్లను సరళతరం చేయాలని ప్రతిపాదనలు చేసింది. గృహ రుణ వడ్డీతో పన్ను మినహాయింపు ప్రయోజనాలు కేవలం సొంతింట్లో ఉంటున్న వారికి మాత్రమే కాకుండా సొంతింటిని అద్దెకు ఇచ్చిన సందర్భాల్లోనూ వడ్డీతో పన్ను మినహాయింపు కల్పించాలని సూచించినట్లు సమాచారం. పన్ను చెల్లింపుదారులందరికీ ప్రయోజనం చేకూర్చేలా స్లాబ్‌లు, రేట్లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.
READ MORE: K.A. Paul: నిమిష ప్రియను రెండు వారాల్లో వెనక్కి తీసుకోస్తాం.. కేఏ పాల్